నందిగామ కే. వీ ఆర్ కాలేజీ లో బాలికపై ప్రేమోన్మాది దాడి

విజయవాడు: కృష్ణా జిల్లా నందిగామ కే.వి.ఆర్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. కాలేజీలో విద్యనభ్యసిస్తున్న బాలికపై ప్రమోన్మాది విచక్షణారహితంగా కర్రతో దాడి చేసి చితకబాదాడు.ఫిర్యాదు చేసేందుకు నందిగామ పోలిస్ స్టేషన్ వద్ద బాధితులు పడిగాపులు పడ్డారు.

మీడియాను ఆశ్రయించిన బాధితురాలు, బంధువులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
ముచ్చింతల్ గ్రామానికి చెందిన మైనర్ బాలిక కె.వి.ఆర్ కాలేజీ నందు మొదటి సంవత్సరం చదువుతుండగా దేవరాజు అనే ఆకతాయి నిత్యం ప్రేమించమంటూ వెంట బడుతున్నాడు.

ఇదే విషయాన్ని బాలిక తల్లితో చెప్పగా పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ చేసి బాలిక జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. తిరిగి మళ్లీ దేవరాజు బాలిక ను వెంబడించి కాలేజీ కి చేరుకొన్నాడు.

కాలేజీ వద్ద మధ్యాహ్న సమయంలో భోజనం నిమిత్తం బాలిక హాస్టల్ కు వెళ్లేందుకు బయటికి రావటం గమనించిన దేవరాజు బాలికకు అడ్డుపడి, నాతో ఎందుకు మాట్లాడటం లేదు పిలిచినా పలకకుండా వెళ్తావా అంటూ పక్కనే ఉన్న కర్రను తీసుకొని విచక్షణారహితంగా చితకబాది పరారయ్యాడు.

అంతట బాధితురాలు నందిగామ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు నిమిత్తం రాగా ఆమె గోడు వినే నాథుడే కరువయ్యాడు బాధితురాలి ఫిర్యాదు తీసుకోకుండా మీన మేషాలు లెక్క పెట్టడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఫిర్యాదు తీసుకోకపోవడంతో బాధితురాలు మీడియాను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+