Jr NTR: ఇష్టమైన హీరో ‘రామారావు జూనియర్’ అంటూ జపాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)పై జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి యోషిమాసా హయాషి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ (RRR) చిత్రం భారతదేశంలోనేగాక, ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుున్న విషయం తెలిసిందే. ఆస్కార్ సహా పలు అంతర్జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
జపాన్ దేశంలోనూ విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. అక్కడి అభిమానులు ఈ సినినామాలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర జపాన్ అభిమానుల హృదయాలను తాకింది. ఈనేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జపాన్ దేశంలో అమాంతం పెరిగిపోయారు. వారిలో ఒకరిగా మారిపోయారు జపాన్ మంత్రి యోషిమాసా.

కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి యోషిమాసా హయాషి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్టీఆర్ఆర్ అభిమానిని అని, తనకు ఆయనంటే ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. భారతీయ సినిమాలకు జపాన్ దేశంలో మంచి గుర్తింపు వస్తోందన్నారు.
Minister Of Foreign Affairs Of #Japan -- Mr. #YoshimasaHayashi says he liked @tarak9999 in #RRRMovie#ManOfMassesNTR #DEVARA #NTRGoseGlobal pic.twitter.com/r2AsuiHGNu
— Bangalore Nandamuri Fans (@BloreNandamuriF) July 28, 2023
ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్‌ను జపాన్ ప్రజలు ఎంతగానో అభిమానించారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్‌లో మీకు ఏ హీరో నచ్చారు? అంటూ ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నకు జపాన్ మంత్రి సమాధానమిస్తూ.. తనకు 'రామారావు జూనియర్ నా అభిమాన హీరో' అని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలతో ఫిక్షనల్ కథగా రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరిగా రామ్ చరణ్ తేజ్, కొమురం భీంగా ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. గత ఏడాది మార్చిలో విడుదలైన ఆర్ఆర్ఆర్.. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. సుమారు వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది.
గత కొద్ది నెలల క్రితం జపాన్ దేశంలోనూ ఆర్ఆర్ఆర్ విడుదలై ఘన విజయం సాధించింది. రూ. 100 కోట్లకుపైగా వసూళ్లను చేయడం విశేషం. జపాన్ దేశంలో భారత్ సినిమాలకు ముఖ్యంగా దక్షిణాది సినిమాలకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు గతంలో బాహుబలి సినిమా కూడా జపాన్‌లో మంచి వసూళ్లు సాధించింది.












Click it and Unblock the Notifications