జూనియర్ ఎన్టీఆర్ కు ఫోన్ చేసిన అల్లు అర్జున్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ కథానాయకులుగా రాణిస్తున్నారు.. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్. నిజ జీవితంలో ఎంతో స్నేహంతో ఉంటారు. ఒకరిపట్ల మరొకరు అభిమానాన్ని కురిపిస్తారు. సోషల్ మీడియాలో కూడా బావా.. బావా.. అంటూ సంభోధించుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీప్రణతి రాఖీ సందర్భంగా ఇంటికెళ్లి మరీ అల్లు అర్జున్ కు రాఖీ కట్టి తన అభిమానాన్ని తెలియజేసింది.

ప్రస్తుతం ఒకరు పాన్ ఇండియా స్టార్ గా, మరొకరు గ్లోబల్ స్టార్ గా రూపాంతరం చెందారు. ఒకరికి సంబంధించిన విషయాలను మరొకరు షేర్ చేసుకోవడంతోపాటు కొన్ని విషయాల్లో ఒకేమాట మీద ఉంటారు. వీరి స్నేహానికి సంబంధించి ఇటీవలే ఒక విషయం బయటకు వచ్చింది. అల్లు అర్జున్ ఓ సినిమా విషయంలో తారక్ కు ఫోన్ చేశాడు. 'బావా.. ఈ సినిమా నువ్వు చేస్తే ఎంతో బాగుంటుంది' అని చెప్పాడు. అదేం సినిమా అంటే అరవింద సమేత. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2018లో విడుదలైన ఈ సినిమా రూ.150 కోట్లకుపైగా వసూళ్లు కురిపించింది. ఈ సినిమాలో జూనియర్ ఎంతో స్టైలిష్ లుక్ తో డిఫరెంట్ గా కనిపించాడు. ఒకవైపు సాఫ్ట్ నేచర్ తో మరోవైపు ఎమోషనల్ గా సినిమాను ముందుండి నడిపించాడు.

junior ntr and allu arjun friendship

ఈ సినిమాకు మొదట త్రివిక్రమ్ అనుకున్నది బన్నీ గురించి. కథను వివరించిన తర్వాత తనకంటే ఎన్టీఆర్ కే ఈ కథ బాగా సెట్ అవుతుందని చెప్పడంతో త్రివిక్రమ్ ఈ కథను జూనియర్ దగ్గరకు తెచ్చారు. 'ఈ కథ నువ్వు చేస్తేనే బాగుంటుంది బావా.. నీకోసమే కథను రాసినట్లుంది.. ఇలాంటి కథలో నిన్ను చూడాలని కోరుకుంటున్నా' అంటూ అల్లు అర్జున్ తారక్ ను రిక్వెస్ట్ చేశాడు. అరవింద సమేతతో జూనియర్ ఒక క్రేజీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+