బాలకృష్ణకు శుభాకాంక్షల వెల్లువ .. జై బాలయ్య అన్న జూనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు, పురంధరేశ్వరి ఇలా !!

సినీనటుడు,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అటు సినీ ప్రముఖుల నుండి,రాజకీయ వర్గాల నుండి, అభిమానుల నుండి బాలయ్యకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అరవై వసంతాలు పూర్తి చేసుకుని 61 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా బాలకృష్ణకు అభినందనలు వెల్లువగా మారాయి.

అటు సినిమాల్లోనూ , రాజకీయంగానూ బాలయ్య ప్రస్థానం

అటు సినిమాల్లోనూ , రాజకీయంగానూ బాలయ్య ప్రస్థానం

నందమూరి తారకరామారావు కుమారుడిగా ఆయన నట వారసత్వాన్ని కొనసాగిస్తూ దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు బాలకృష్ణ. 14 సంవత్సరాల వయసులోనే తాతమ్మకల తో ప్రారంభమైన ఆయన సినిమా జర్నీ 60పదుల వయసులోనూ కొనసాగుతోంది. ఇక రాజకీయాల్లోకి వచ్చిన బాలయ్య హిందూపురం నుండి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ ప్రజలకు ప్రజాప్రతినిధిగా సేవలందిస్తున్నారు. నేడు బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మాజీ సీఎం చంద్రబాబు బాలకృష్ణ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

బాలయ్య చేసేపనిలో నిబద్ధతే ఆయన కోట్లాది అభిమానులకు కారణం : చంద్రబాబు

బాలయ్య చేసేపనిలో నిబద్ధతే ఆయన కోట్లాది అభిమానులకు కారణం : చంద్రబాబు

నటన అయినా ప్రజాసేవ అయినా చేసే పనిలో నూటికి నూరుపాళ్లు నిబద్ధతతో ఉండే వ్యక్తి బాలకృష్ణ గారు అంటూ చంద్రబాబు బాలయ్యను కొనియాడారు. ఆయన కోట్లాది మంది అభిమానులను తన నిబద్ధతతోనే సంపాదించుకున్నారని పేర్కొన్నారు. బాలకృష్ణ అరవై వసంతాలు పూర్తిచేసుకుని 61 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు షష్టిపూర్తి మహోత్సవ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు.

బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన పురంధరేశ్వరి

బాలయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన పురంధరేశ్వరి

ఇక ఇదే సమయంలో బిజెపి నేత పురంధరేశ్వరి కూడా బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. దగ్గుబాటి పురంధరేశ్వరి తన ట్విట్టర్ ఖాతాలో బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిద్దరూ ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. సోదరా .. జన్మదిన శుభాకాంక్షలు అంటూ పురంధరేశ్వరి బాలకృష్ణను విష్ చేశారు. రాజకీయంగా వేరు వేరు పార్టీల్లో ఉన్నా సోదరుని పుట్టిన రోజున ఆమె విష్ చేశారు.

నాకు ఊహతెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే : జూనియర్ ఎన్టీఆర్

నాకు ఊహతెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే : జూనియర్ ఎన్టీఆర్

ఇక జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా తన బాబాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బాలయ్య అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇక అందులో నాలోని అభిమానిని తట్టిలేపింది మీరే.. నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే.. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీకు జన్మదిన శుభాకాంక్షలు బాబాయ్ అంటూ బాలయ్యపై ఉన్న తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

Recommended Video

    #HappyBirthdayNBK: ఎలా మాట్లాడాలో తెలుసుకోరా ** కొడకా.. బాలయ్య డైలాగ్ ఆ రాజకీయ నాయకుడి గురించేనా
    నాకు తండ్రి తర్వాత తండ్రిస్థానంలో ఉన్న బాబాయ్ నాకు స్ఫూర్తి : కళ్యాణ్ రామ్

    నాకు తండ్రి తర్వాత తండ్రిస్థానంలో ఉన్న బాబాయ్ నాకు స్ఫూర్తి : కళ్యాణ్ రామ్

    ఒక జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు కళ్యాణ్ రామ్, నందమూరి సుహాసిని తదితర కుటుంబ సభ్యులు బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్ అంటూ తన ప్రేమను వ్యక్తం చేశారు. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ పేర్కొన్నారు. మొత్తానికి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా నందమూరి కుటుంబం నుండి బాలయ్యకు శుభాకాంక్షలు వెల్లువ గా మారాయి

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+