అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం 'దేవర' (Devara). పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీపై సినీ ప్రియుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్‌లుక్ పోస్టర్లతో ఇవి మరోస్థాయికి వెళ్లాయి. తాజాగా ఈ చిత్ర బృందం అభిమానులకు శుభవార్త వినిపిస్తూ ఓ అప్‌డేట్‌ను షేర్ చేసింది.
కొద్దిరోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఐదో షెడ్యూల్ పూర్తయినట్లు మూవీ టీమ్ తెలిపింది. మరో రెండు రోజుల్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించింది. దీనికోసం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక సెట్ ఏర్పాటు చేశారు. హాలీవుడ్ కొరియోగ్రాఫర్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ను ఈ చిత్ర బృందం పంచుకుంది.

'దేవర'కు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఓ కీలకపాత్రలో నటించనుందనే వార్త ప్రచారమవుతోంది. 'శాకుంతలం' చిత్రంలో తన నటనతో అర్హ అందరి దృష్టిని ఆకర్షించింది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. తారక్ సరసన బాలీవుడ్ కథానాయిక జాన్వీకపూర్ నటిస్తోంది. ప్రతినాయకుడిగా ప్రముఖ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. ఓ తీర ప్రాంత నేపథ్యంతో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. అనిరుధ్ స్వరాలందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ సినిమా చేయబోతున్నారు. అదికూడా పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటోంది.












Click it and Unblock the Notifications