junior ntr: ఊహించని ట్విస్ట్ ఇచ్చిన Jr NTR, కొరటాల
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం రూపుదిద్దుకుంటోంది. శివ ఈ చిత్రానికి పవర్ ఫుల్ కథను సిద్ధం చేశారు. ఇప్పటికే నాలుగు షెడ్యూళ్లను ఈ సినిమా పూర్తిచేసుకుంది. జులై 3వ తేదీ నుంచి తర్వాత షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న దేవర కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కెమెరాను ఉపయోగిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కో అప్ డేట్ బయటకు వస్తుంటే అభిమానులు ఊగిపోతున్నారు.
RRR సినిమా తర్వాత జూనియర్ చేస్తున్న చిత్రమే దేవర. ఈ సినిమాలో డబుల్ రోల్ లో కనిపిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. జూనియర్ గతంలో నా అల్లుడు, ఆంధ్రావాలా, అదుర్స్ చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. దేవర క్లైమాక్స్ లో పార్ట్ 2 కు సంబంధించిన లీడ్ ఉంటుందని, అందుకు తగ్గట్లుగానే దర్శకుడు శివ స్టోరీని డిజైన్ చేశారని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. స్క్రిప్ట్ కోసమే 6నెలలు శ్రమించిన శివ.. ప్రీప్రొడక్షన్ కోసం మరో 6 నెలలు వెచ్చించి పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగారు. కోస్టల్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో సినిమా రూపుదిద్దుకుంటోంది.

'దేవర' చిత్రంలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుధ్ సైతం మొదటిసారి జూనియర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు దేవర కోసం బిజీబిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఇది విడుదల కానుంది.












Click it and Unblock the Notifications