జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కూడా ఆగిపోయాయి.. తెలుసా?

నందమూరి తారకరామారావు మనవడిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. రెండు సంవత్సరాలకే ఎవరూ అందుకోలేనటువంటి మాస్ ఫాలోయింగ్ ను సంపాదించారు. సింహాద్రి సినిమా సమయానికి అభిమానుల విషయంలో ఏకంగా మెగాస్టార్ చిరంజీవికే పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగాడు. స్టార్ స్టేటస్ వచ్చినప్పుడు తారక్ వయసు కేవలం 17.

సింహాద్రి తర్వాత వరుసగా కొన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఇలా జూనియర్ కెరీర్ గురించి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో కూడా పూజా కార్యక్రమాలు జరుపుకొని ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ నటించిన అరవింద సమేత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో మరో సినిమా చేయాలని జూనియర్ భావించాడు.

Junior NTR stopped films list

ఈ చిత్రానికి ప్రారంభోత్సవం కూడా చేశారు. కథ ఫైనల్ గా ప్రేక్షకులను మెప్పించలేదేమో అనిపించి ఆ సినిమాను ఆపేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో ఊపిరి సినిమా చేయాల్సి ఉంది. నెలరోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుండగా ఈ సినిమా నుంచి తారక్ తప్పుకున్నాడు. ఆయన స్థానంలో కార్తీ వచ్చాడు. ఈ పాత్ర ఎంత క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో 'గరుడ' అనే చిత్రాన్ని చేద్దామనుకున్నారు. అయితే ఈ సినిమా కూడా చర్చల దగ్గరే ఆగిపోయింది. భవిష్యత్తులో అయినా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్తుందేమననే ఆశతో జూనియర్ అభిమానులున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+