NTR: జూనియర్ NTR చేతికి ఉన్న వాచ్ ఎంతో తెలుసా?
స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (NTR) తన నివాసంలో ప్రత్యేక విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతోపాటుఅమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫర్రెల్ కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఎన్టీఆర్ తన ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అలాగే ఆ ఫొటోల్లో జూనియర్ ధరించిన చేతి వాచీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఖరీదైన వస్తువులతో వార్తల్లో నిలిచారు.
బ్లాక్ కలర్ టీషర్టులో ఎన్టీఆర్ చాలా స్టైలిష్ గా కనిపించారు. అయితే ఎన్టీఆర్ లుక్ తో పాటు ఆయన చేతికి ధరించిన వాచ్ కూడా అందరినీ ఆకట్టుకుంది. అది ఒక బ్రాండెడ్ వాచ్. దాని ధరతో ఓ సినిమాను నిర్మించవచ్చు. రిచార్డ్ మిల్లీ బ్రాండ్ కు చెందిన ఈ వాచీ ధర రూ. 8 కోట్ల పైనే. గతంలో కూడా ఖరీదైన వాచీలతో ఎన్టీఆర్ వార్తల్లో నిలిచారు. ఈ విందుకు మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

తారక్ తన 30వ చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నారు.












Click it and Unblock the Notifications