పోలీసులకు భయపడేదే లేదు-కోర్టుకు లాగుతాం-వైఎస్ అవినాష్ రెడ్డి హెచ్చరిక..!

ఏపీలో వరుసగా జరుగుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇవాళ మండిపడ్డారు. పోలీసుల అక్రమ అరెస్టులు, కూటమి ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి కార్యకర్తలను, నాయకులను పగలు రాత్రిళ్ళు తేడా లేకుండా పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
తన పిఏ రాఘవరెడ్డి నిత్యం పోలీసులతో మాట్లాడే వ్యక్తి అని, కానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆయన ఇంటికి రాత్రులు వెళ్లి ఇంట్లో వారిని భయభ్రాంతులకు గురి చేశారని అవినాష్ విమర్శించారు.

లాఠీలతో డోర్లు కొట్టి ఇంట్లో వస్తువులను చిందరవందర చేసి భయపెట్టారని అవినాష్ ఆరోపించారు. భయాందోళన గురి చేయకుండా స్టేషన్కు రావాలని పిలిచినా రాఘవ వెళ్లేవాడన్నారు. అలాంటిది ఇంటికి వెళ్లి భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం పోలీసులకు ఏముందన్నారు. ఇలా రాత్రిళ్ళు పోలీసులు చేస్తున్న తీరు రౌడీలను తలపిస్తుందన్నారు. ప్రతిరోజు రాత్రిళ్ళు వైసిపి కార్యకర్తలను భయాందోళనకు గురి చేయడమే పోలీసులు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

Kadapa ysrcp mp ys avinash reddy warns police to drag over social media workers arrests

కూటమి ప్రభుత్వ మాటలు విని నడుచుకుంటున్న పోలీసులను చూసి భయపడేవారు ఎవరూ లేరన్నారు. వర్ర రవీంద్రారెడ్డిని నిన్న మహబూబ్నగర్ జిల్లాలో అరెస్టు చేసినట్లు ఎల్లో మీడియానే రాసిందన్నారు. కానీ పులివెందుల టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నారన్నారు. వర్ర రవిని పోలీసుల అరెస్టు చేయలేదని...వైసీపీ సోషల్ మీడియా అంతా తప్పుడు ప్రచారం చేస్తోందని.. వర్రా రవి అరెస్టుకు పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని... వర్రా రవికి ఏదైనా జరిగితే వైసిపిదే బాధ్యత అంటూ బీటెక్ రవి మాట్లాడారని, వాస్తవాలు తెలియకుండా బీటెక్ రవి ఇలా అబద్ధాలు మాట్లాడితే ఫూల్ కావడం తప్ప మరొకటి కాదన్నారు.

నిన్న రాత్రి అంతా కడప డిటిసిలో వర్రా రవిని వేధించారని, కర్నూల్ రేంజ్ డీఐజీ, అన్నమయ్య జిల్లా ఎస్పీలు దగ్గరుండి వర్రా రవిని వేధించారని అవినాష్ ఆరోపించారు. తప్పుడు కేసులు బనాయించాలని వర్రా రవిని పోలీసులు వేధిస్తున్నారన్నారు.
వర్రా రవి, వైసిపి కార్యకర్తల పట్ల పోలీసులు చేస్తుంది తప్పన్నారు. పోలీసులు తప్పు చేస్తే చూస్తూ ఊరుకునే వారు ఎవరూ లేరన్నారు. పోలీసుల చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, తక్షణం వర్రా రవిని కోర్టులో హాజరు పరచాలని అవినాష్ డిమాండ్ చేశారు. టిడిపి నాయకుల ఆదేశాల మేరకు నడుచుకుంటున్న పోలీసుల తీరును ఖండించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+