వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే ఆపేశా: ముద్రగడ, రైలు దగ్ధం వెనుక 'భారీ' వ్యూహం! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: తాము అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా హింసాయుత సంఘటనలు జరగడంతో వెంటనే ఉద్యమాన్ని ఆపేసినట్లు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం నాడు తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీ వల్లే కాపులు రోడ్డెక్కాల్సి వచ్చిందన్నారు.

కమిషన్లతో కాలయాపన చేస్తూ కాపుల కడుపు కొడుతున్నారన్నారు. జీవో 30లో తప్పులు ఉంటే దాన్ని సరిదిద్ది ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆశ పెట్టారు కాబట్టే చంద్రబాబును అడుగుతున్నామన్నారు.

గ్రామాల్లో కాపులపై వేధింపులకు పాల్పడుతున్నారని, అమాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందన్నారు. హింసకు చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. ఉద్యమానికి తనదే బాధ్యత అని, పచ్చి అబద్ధాలతో కాపుల ఓట్లు పొందిన చంద్రబాబు ఆ అబద్ధాలను నిజంచేసే ప్రయత్నం చేయాలని డిమాండ్‌ చేశారు.

ముద్రగడ

ముద్రగడ

కిర్లంపూడిలో సోమవారం నాడు విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం, తదితరులు.

తుని ఘటన

తుని ఘటన

కాపు ఐక్య గర్జన తరువాత తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నివాసంలో సోమవారం గంభీర వాతావరణం చోటుచేసుకొంది.

 తుని ఘటన

తుని ఘటన

తునిలో గర్జన హింసాత్మకం కావడంతో ఆందోళనకు ముగింపు పలికిన ముద్రగడ నిరశన అస్త్రం ప్రయోగించడంతో మరోసారి పరిస్థితి ఉద్విగ్నంగా మారింది.

తుని ఘటన

తుని ఘటన

శుక్రవారం నుంచి సతీసమేతంగా ఆమరణ దీక్షకు దిగుతానని ముద్రగడ చెప్పడంతో ఆయన కుటుంబంతో పాటు సన్నిహితుల్లో ఉత్కంఠ నెలకొంది.

 తుని ఘటన

తుని ఘటన

ప్రభుత్వ కదలికలు, అధికారుల కసరత్తును తెలుసుకున్న ఆయన మద్దతుదారులు ప్రభుత్వం నుంచి సానుకూల కబురు వస్తుందేమోన్న అంచనాతో ముద్రగడ శిబిరంలో గడిపారు. ఆయన ఇంటి ఆవరణలో టీవీలు చూస్తూ ఏం జరుగుతోందో ప్రతి క్షణం తెలుసుకున్నారు.

 తుని ఘటన

తుని ఘటన

కాపు ఐక్య గర్జన అదుపు తప్పి విధ్వంసాలకు దారితీయడంతో జరిగిన పరిణామాల నుంచి తుని పట్టణం ఇంకా కోలుకోలేదు. స్థానికంగా సాధారణ వాతావరణం కనిపిస్తున్నప్పటికీ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన చాలామందిలో నెలకొంది.

 తుని ఘటన

తుని ఘటన

పోలీసులు, పెద్దసంఖ్యలో ప్రత్యేక బలగాలు మోహరించి తుని పట్టణాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

తుని ఘటన

తుని ఘటన

సభ ప్రాంతంతో పాటు విధ్వంసాలు జరిగిన ప్రాంతాలను ఉన్నతాధికారులు పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఉన్న పోస్టింగులు, పలువురు సెల్‌ఫోన్లలో చిత్రీకరించిన దృశ్యాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

 తుని ఘటన

తుని ఘటన

తునిలో విధ్వంసమంతా ప్రణాళిక ప్రకారమే చేశారని ప్రాథమికంగా గుర్తించినట్లు శాంతిభద్రతల అదనపు డీజీ ఆర్పీ ఠాకూర్‌ వెల్లడించారు. తునిలో సోమవారం ఆయన గ్రామీణ, పట్టణ పోలీస్‌స్టేషన్లను పరిశీలించారు.

తుని ఘటన

తుని ఘటన

రైలు, పోలీస్‌ స్టేషన్లు, వాహనాలను దహనం చేసే సమయంలో పోలీసులను రెచ్చగొట్టి, కాల్పులు జరిగేలా చేసి మరింత అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారని అర్థమవుతోందన్నారు.

తుని ఘటన

తుని ఘటన


రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను తగులబెడితే కేంద్ర స్థాయిలో ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని భావిస్తున్నామన్నారు.

 తుని ఘటన

తుని ఘటన

ప్రజలు భయాందోళనకు గురికావద్దని భరోసా ఇచ్చారు. హింసాత్మక సంఘటనల నేపథ్యంలో సెక్షన్‌ 30, 144లు అమలు చేస్తున్నామన్నారు.

అందుకే ఆపేశా: ముద్రగడ, రైలు దగ్ధం వెనుక 'భారీ' వ్యూహం! (పిక్చర్స్)

అందుకే ఆపేశా: ముద్రగడ, రైలు దగ్ధం వెనుక 'భారీ' వ్యూహం! (పిక్చర్స్)

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ధ్వజమెత్తారు. వంగవీటి రంగా హత్యకు కారణమైన క్రిమినల్‌వి అని మండిపడ్డారు.

English summary
Kapu agitation: A politics of discontent and affirmative action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X