కాపు రిజర్వేషన్ల కాక : దీక్షలు - చలో పాలకొల్లుకు పిలుపు..!!

ఏపీలో ఎన్నికలకు సమాయత్తం అవుతున్న వేళ కాపు రిజర్వేషన్ల అమలుకు ఒత్తిడి పెరుగుతోంది. కాపులకు రిజర్వేషన్ల అంశం పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కాపు నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో కాపులకు అయిదు శాతం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది అమలు కాలేదు. దీని పైన న్యాయస్థానాల్లో కేసులు కారణంగా చెబుతూ వచ్చారు. తాజాగా పార్లమెంట్ వేదికగా కేంద్రం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లలో ఎవరికి ఎంత మేర అమలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకుంటాయని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీంతో.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు కాపు నేతలు లేఖలు రాస్తున్నారు.

ఇప్పటికే మాజీ ఎంపీ, కాపు నేత చేగొండి హరి రామజోగయ్య ముఖ్యమంత్రికి లేఖ రాసారు. కాపు రిజర్వేషన్ల అంశం పైన ఈ నెలాఖరులోగా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్రం తాజాగా పార్లమెంట్ వేదికగా స్పష్టం చేసిన అంశాలను ప్రస్తావించారు. సానుకూల నిర్ణయం తీసుకోకుంటే జనవరి 2వ తేదీ నుంచి తాను దీక్షకు దిగుతానని హరిరామ జోగయ్య హెచ్చరించారు. కాపు ఉద్యమ నేత ముద్రగద పద్మనాభం నాలుగు రోజుల వ్యవధిలో సీఎం జగన్ కు రెండు సార్లు లేఖలు రాసారు. కాపు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. సుప్రీం కోర్టు తీర్పు, పార్లమెంట్ లో కేంద్రం ఇచ్చిన సమాధానం అంశాలను ముద్రగడ తన లేఖలో ప్రస్తావించారు. ఈ రోజు తాజాగా మరో లేఖ రాసిన ముద్రగడ అందులో ఎవరి ప్రమేయం లేకుండా దళితులు వారి పదవులకు వారే ఓటు వేసుకునే విధానంలో ఆలోచన చేయాలని కోరారు.

Kapu leaders raising demand for reservation in EWS quota, AP Govt to take Decision

ఇప్పుడు తాజాగా కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామజోగయ్య విధించిన గడువును సమర్ధిస్తూ ఆ సంఘ నేతలు ముందుకు వచ్చారు. కాపులకు అయిదు శాతం రిజర్వేష్ల అమలు పై ఈ నెల 31లోగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం స్పందించకపోతే జనవరి 2న ఛలో పాలకొల్లు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇప్పటికే హరి రామజోగయ్య లేఖ పైన మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. జోగయ్య దీక్ష చేస్తే స్వాగతిస్తామన్నారు. కాపు రిజర్వేషన్ల అంశంలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందనేది ఆసక్తిగా మారుతోంది. ఎన్నికల సమీకరణాల వేళ.. ముఖ్యమంత్రి జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+