కర్మ వదిలిపెట్టదు: వారికి పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక

ఎవరైనా ఎవరినైనా దూషించే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాలని.. లేదంటే కర్మ వారిని వదిలిపెట్టదన్నారు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. అంతేగాక, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాల్లో సైకోల్లా రెచ్చిపోయేవారికి హెచ్చరికలు చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు డిప్యటీ సీఎం పవన్.

'నిర్మాణాత్మక విమర్శలు ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం. దూషించడం, హత్యలు, అత్యాచార బెదిరింపులు సరికాదు. ప్రజాస్వామ్యంలో మనమంతా వివిధ అంశాలపై విభేదించవచ్చు.. అసమ్మతి వ్యక్తం చేయవచ్చు. కానీ, ఇది విధానాల వరకే పరిమితం కావాలి తప్ప వ్యక్తిగతం కారాదు. ఇందులోకి కుటుంబాలు, వ్యక్తులను లాగడం, కుల దూషణలు, ఎదుటి వ్యక్తుల విశ్వాసాలను దెబ్బతీయడం, దేవుళ్లపై దాడి చేసేలా ఉండొద్దు' అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.

Karma doesn t let go Pawan Kalyan s dire warning to them

అంతేగాక, 'కండబలం, ధనబలం, క్రిమినల్ గ్యాంగులతో ఈ దేశంలోని సగటు భారతీయుడిని బెదిరించలేరు. అందువల్ల క్రిమినల్ ముఠాలు, గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా దుర్వినియోగానికి పాల్పడిన వారికి ఒకటే చెబుతున్నా.. దూషించే ముందు ఒకటికి వందసార్లు ఆలోచించుకోండి. కర్మ వదిలిపెట్టదు' అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక చేశారు.

మరోవైపు, గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో మాట్లాడిన సందర్భంగానూ మహిళలపై నేరాలకు పాల్పడేవారిని పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. మహిళా భద్రత విషయంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపును ఇచ్చారు.
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు.

తమది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఐఏఎస్‌​లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు. అధికారులపై చిన్న గాటు పడినా చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరవై ఏళ్ళు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+