వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి కుమార్తె పెళ్లికి జగన్ ఢుమ్మా: ఇలా జరుగుతుందనే !

గాలి కుమార్తె పెళ్లికి జగన్ ఢుమ్మా: ఇలా జరుగుతుందనే !

|
Google Oneindia TeluguNews

కడప: మైనింగ్ కింగ్, కర్ణాటక పర్యాటక శాఖ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ హాజరుకాకపోవడంతో అప్పట్లు ఈ విషయంపై మీడియాలో జోరుగానే ప్రచారం జరిగింది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు సైతం ఈ పెళ్లి వేడుకకు దూరంగా ఉన్నారు. కొందరు వైఎస్ఆర్ సీపీ నాయకులు మాత్రమే పెళ్లికి హాజరైనారు. గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లికి జగన్ రాకపోవడమే మంచిది అయ్యిందని ఇప్పుడు ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

Karnataka Mining baron Gali Janadhan Reddy and YSRCP chief Jagan

గాలి జనార్దన్ రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు చేసి తన కుమార్తె వివాహం జరిపించారు. ఈ పెళ్లి గురించి అప్పట్లో నెల రోజుల పాటు జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గాలి కుమార్తె పెళ్లికి రూ. 100 కోట్లు అని ఒకరు, రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటూ మరొకరు వార్తలు ప్రసారం చేశారు. ఎవరి ఊహలకు వారు వార్తలు ప్రసారం చేశారు.

గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి కోసం రూ. 100 కోట్ల పాత నోట్లను రెవెన్యూ శాఖ అధికారి బీమా నాయక్ సహాయంతో కొత్త నోట్లుగా మార్పిడి చేశారని ఇప్పుడు ఆరోపణలు రావడంతో గాలి అనుచరులు ఉలిక్కిపడ్డారు.

ఇలాంటిది ఎదో జరుగుతుందని ముందుగానే గుర్తించిన జగన్ గాలి ఇంట జరిగిన పెళ్లికి దూరం అయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారానికి దూరం అయిన జగన్ వచ్చే ఎన్నికల మీద దృష్టి పెట్లారు.

వచ్చే శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో వివాదాల్లో చిక్కుకోకూడదని భావించి జగన్ గాలి ఇంట జరిగిన పెళ్లికి దూరంగా ఉన్నారని సమాచారం.

English summary
Along with 20 percent cut, Naik allegedly wanted Reddy to help him get a ticket to contest the 2018 Karnataka elections, Ramesh Gowda’s letter claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X