మొహమూద్ రంజాన్ విందు: కెసిఆర్, కవిత (ఫొటోలు)

హైదరాబాద్: రంజాన్ పర్వదినం సందర్భంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మొహమూద్ అలీ తన నివాసంలో మంగళవారం ఇచ్చిన విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హాజరయ్యారు. అలీ ఇచ్చిన విందుకు హాజరై ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

కెసిఆర్‌తో పాటు తెలంగాణ మంత్రులు నాయని నర్సింహా రెడ్డి, పద్మారావు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్లమెంటు సభ్యులు కె. కేశవరావు, కల్వకుంట్ల కవిత తదితరులు హాజరయ్యారు. వారితో పాటు డిజిపి అనురాగ్ శర్మ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి కూడా విందులో పాల్గొన్నారు.

మొహమూద్ అలీ ఇంటికి కెసిఆర్

మొహమూద్ అలీ ఇంటికి కెసిఆర్

రంజాన్ పర్వదినం సందర్భంగా మంగళవారంనాడు తన ఇంటిలో ఏర్పాటు చేసిన విందుకు వచ్చిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు స్వాగతం చెబుతున్న డిప్యూటీ సిఎం మొహమూద్ అలీ.

మొహమూద్ అలీ ఇంటికి కెసిఆర్

మొహమూద్ అలీ ఇంటికి కెసిఆర్

రంజాన్ సందర్భంగా తన నివాసంలో డిప్యూటీ ముఖ్యమంత్రి మొహమూద్ అలీ ఏర్పాటు చేసిన విందుకు హాజరైన కెసిఆర్ ఇలా..

మొహమూద్ అలీ ఇంటికి కెసిఆర్

మొహమూద్ అలీ ఇంటికి కెసిఆర్

రంజాన్ పర్వదినం సందర్భంగా తన నివాసంలో డిప్యూటీ సిఎం ఏర్పాటు చేసిన విందుకు హాజరైన ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు మంత్రులు, అధికారులు

మొహమూద్ అలీ నివాసంలో కెసిఆర్

మొహమూద్ అలీ నివాసంలో కెసిఆర్

రంజాన్ సందర్భంగా తన నివాసంలో మొహమూద్ అలీ ఏర్పాటు చేసిన విందుకు హాజరైన కెసిఆర్ ఇలా కనిపించారు.

విందు ఆరగిస్తూ కెసిఆర్

విందు ఆరగిస్తూ కెసిఆర్

మొహమూద్ అలీ నివాసంలో ఏర్పాటైన విందుకు హాజరైన కెసిఆర్, మంత్రులు, అధికారులు, ప్రభుత్వ సలహాదారులతో ఇలా..

మొహమూద్ అలీ నివాసంలో కెసిఆర్

మొహమూద్ అలీ నివాసంలో కెసిఆర్

తన నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు సెంట్ రాస్తూ ఉప ముఖ్యమంత్రి మొహమూద్ అలీ ఇలా...

గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జిహెచ్ఎంసి) కమిషరన్ సోమేష్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు రమణాచారి, ఎకె గోయల్, విద్యాసాగర రావు తదితరులు మొహమూద్ అలీ ఇచ్చిన విందుకు వచ్చేశారు. అంతకుముందు శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ ఉప ముఖ్యమంత్రి మొహమూద్ అలీని కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లిం సోదరులు రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ వేడుకలను జరుపుకున్నారు. హైదరాబాదులో ముస్లిం సోదరులు మక్కా మసీదులో ప్రార్థనలు చేశారు. అలయ్ బలయ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా పాతబస్తీలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. బందోబస్తు ఏర్పాట్లను మహేందర్ రెడ్డి పర్యవేక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+