ఎన్టీఆర్-బాబు,పవన్-చిరు సహా వారెవరు కలిసినా అంతే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మూడు రోజుల క్రితం బేగంపేట విమానాశ్రయంలో కలుసుకోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
రాజకీయాల్లో ఎవరు శాశ్వత మిత్రులు, ఎవరు శాశ్వత శత్రువులు కాకపోయినప్పటికీ.. పలువురు కలయిక పైన ఉత్కంఠ ఉంటుంది. కలిస్తే అదో అద్భుతంగా చెబుతారు.
కారణం ఏదైనా.. చిరంజీవి-పవన్ కళ్యాణ్, పవన్-నరేంద్ర మోడీ, బాలకృష్ణ-పవన్, బాలకృష్ణ-జూ ఎన్టీఆర్, చంద్రబాబు-కేసీఆర్, చంద్రబాబు-జగన్, చంద్రబాబు-హరికృష్ణ, చంద్రబాబు-జూ.ఎన్టీఆర్‌లు కలుసుకోవడం అపూర్వమేనంటారు. వీరు ఎదురు పడినప్పుడు ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ సామాన్యుడిలో సాధారణంగా ఉంటుంది.

చంద్రబాబు - కేసీఆర్
నాడు మిత్రులు అయిన చంద్రబాబు, కేసీఆర్‌లు ఇప్పుడు ఇరు రాష్ట్రాలకు సీఎంలుగా ఉన్నారు. విభజనకు ముందు, విభజన తర్వాత కేసీఆర్ టీడీపీని టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కనిపిస్తోంది. అయితే, మూడు రోజుల క్రితం వారు బేగంపేట విమానాశ్రయంలో కలుసుకొని, ఆప్యాయంగా మాట్లాడుకోవడం చర్చాంశమైంది.

చిరంజీవి - పవన్ కళ్యాణ్
మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను ఒక్కదగ్గర చూస్తే మెగా అభిమానులకు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. అయితే, చిరంజీవి తాను స్థాపించిన ప్రజారాజ్యాన్ని కాంగ్రెసు పార్టీలో విలీనం చేశాక.. పవన్ కళ్యాణ్‌లో అసంతృప్తి కనబడింది. ఇటీవల ఎన్నికలకు ముందు పవన్ ఏకంగా జనసేన పార్టీని స్థాపించారు. అయితే, చిరంజీవి ముఖ్యనేతగా ఉన్న కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకమైన బీజేపీ, టీడీపీలకు పవన్ మద్దతుగా ప్రచారం చేశారు. దీంతో, ఇప్పుడు చిరు, పవన్‌లు

నరేంద్ర మోడీ - పవన్ కళ్యాణ్
సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున జోరుగా ప్రచారం చేశారు. అదే సమయంలో.. బీజేపీ అధికారంలోకి వచ్చి ప్రజావ్యతిరేక పనులు చేపడితే మోడీని అయినా నిలదీస్తానని పవన్ చెప్పారు. ఎన్నికల అనంతరం మోడీ, బీజేపీ పవన్‌కు మంచి ప్రాధాన్యం ఇచ్చింది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు దాటింది. ఈ నేపథ్యంలో మోడీ, పవన్‌లు కలుస్తారా లేక మోడీ ప్రభుత్వాన్ని అనేది చర్చనీయాంశమైంది.

బాలకృష్ణ - పవన్ కళ్యాణ్
సినిమాల విషయానికి వస్తే నిన్నటి వరకు మెగా వర్సెస్ నందమూరిగా ఉండేది. అయితే, మెగా సోదరుడు పవన్ కళ్యాణ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. అదే టీడీపీ నుండి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీరు కలిస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.

జూ ఎన్టీఆర్ - బాలకృష్ణ
తెలుగుదేశం పార్టీ వారసత్వ పోరు నేపథ్యంలో చంద్రబాబు, బాలకృష్ణల పైన నిన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు అసంతృప్తితో ఉన్నారు. ఒకప్పుడు పదేపదే బాబాయి, మామయ్య అన్న జూనియర్ ఇప్పుడు వారు ఎదురు పడితే.. ఎవరు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం.

జూ ఎన్టీఆర్ - చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ వారసత్వ పోరు నేపథ్యంలో చంద్రబాబు, బాలకృష్ణల పైన నిన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు అసంతృప్తితో ఉన్నారు. ఒకప్పుడు పదేపదే బాబాయి, మామయ్య అన్న జూనియర్ ఇప్పుడు వారు ఎదురు పడితే.. ఎవరు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరం.

చంద్రబాబు - జగన్
ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌లు ఇప్పుడు అసెంబ్లీలో కలుసుకునే అవకాశం ఉంది. ఇటీవల గవర్నర్ ఇఫ్తార్ విందులోను ఇరువురు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు.












Click it and Unblock the Notifications