కేసీఆర్ మాజీ సీఎం కాదట.. కానీ చంద్రబాబు మాజీ సీఎం: బీఆర్ఎస్ ట్వీట్‌పై రచ్చ!!

సహజంగా ఎవరైనా అధికారం కోల్పోయిన తర్వాత మాజీలు అవుతారు. మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి అని వారిని ఎవరైనా సంబోధిస్తారు. అయితే కేసీఆర్ విషయంలో మాత్రం ఆయన మాజీ కాదని చెబుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. బీఆర్ఎస్ పార్టీనేతలు మాత్రమే కాదు బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా కూడా ఆయన మాజీ కాదని స్పష్టంచేస్తుంది. తాజాగా చంద్రబాబు కేసీఆర్ ను కలిసిన సమయంలో పెట్టిన పోస్టు అందుకు కారణంగా మారింది.

14 సంవత్సరాల ఉద్యమ పార్టీ,పదేళ్లు అధికారం అనుభవించిన బిఆర్ఎస్ పార్టీ నేతలు అధికారానికి దూరమై పదిరోజులు కూడా కాకముందే...తమ ఓటమిని, చేజారిన అధికారాన్ని కలలో కూడా జీర్ణించుకోలేకపోతున్నారా.. ?అంటే అవును అని తాజాగా బీఆర్ఎస్ పెట్టిన పోస్ట్ చూసిన జనాలు చర్చించుకుంటున్నారు. అందుకు కారణం బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా కెసిఆర్ ను మాజీ ముఖ్యమంత్రి అని కాకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అంటూ తమ ఖాతాలలో పోస్ట్ చేయడమే.

KCR is not ex-CM.. but Chandrababu is ex-CM: criticism over BRS tweet!!

ఇటీవల చంద్రబాబు యశోదా ఆస్పత్రిలో కేసీఆర్ ను పరామర్శించినప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారిని టీడీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అంటూ బీఆర్ఎస్ అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు.

ఐతే ఈ అంశాన్ని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.కేసీఆర్ తెలంగాణా తొలి ముఖ్యమంత్రి అయ్యారు కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి సీఎం మాత్రం మాజీ అయ్యారా? అంటూ ఆ పోస్ట్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీలో సీఎంగా చంద్రబాబు నాయుడు మొదటి ఐదేళ్లు పాలన సాగించారు.

ఆ తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబును మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అని అందరూ సంబోధిస్తున్నారు. అధికారం పోయాక మాజీ అని అంతా ఒప్పుకోవాల్సిందే. కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఓటమి, అధికారాన్ని కోల్పోయామని నిజాన్ని అంగీకరించటం చాలా కష్టంగా మారింది. అందుకే పోస్ట్ లో అలా పెట్టారని కొందరు విమర్శిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+