మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పునాదిరాళ్లు వెక్కిరిస్తున్నాయి, గత ఆంధ్ర సిఎంలకే చెల్లింది: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

జహీరాబాద్: మహేంద్ర కంపెనీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని, తెలంగాణ చాలా గాయపడ్డ ప్రాంతమని, ఎంతో కష్టపడి రాష్ర్టాన్ని తెచ్చుకున్నామని, పరిశ్రమలు ఏది కోరితే అది ఇస్తున్నామని, కాబట్టి ఉద్యోగాలు తమ పిల్లలకే ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు.. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కొత్త యూనిట్ ప్రారంభోత్సవ సభలో బుధవారం ఆయన మాట్లాడారు.

హైదరాబాద్‌లో 100 మిలియన్ అమెరికా డాలర్ల పెట్టుబడులతో సామ్‌సంగ్ కంపెనీ హార్డ్‌వేర్ పార్క్ పెట్టేందుకు ఆస్తకి చూపుతున్నదని తెలిపారు. అనేక మల్టీ నేషన్ కంపెనీలు పెట్టుబులు పెట్టడానికి తరలివస్తున్నాయని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పునాది రాళ్లు వెక్కిరిస్తున్నాయని, ఎన్నికల ముందు వాగ్ధానాలు ఇచ్చి మోసం చేయడం ఆంధ్ర ముఖ్యమంత్రులకే చెల్లిందని విమర్శించారు.

మహీంద్రా కంపెనీ తయారు చేసిన నూతన వాహనాన్ని స్వయంగా నడిపి ముఖ్యమంత్రి దాన్ని ప్రారంభించారు.
మహీంద్రాకు వ్యాట్ శాతం 5 శాతానికి తగ్గిస్తామని హామీ ఇచ్చారు. మహీంద్రాకు అవసరమైన సహకారం ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.

 KCR launches new unit of Mahindra and Mahindra

కరెంట్ కోతలుండవు...

తెలంగాణలో కరెంటు కోతలు ఉండవని, కరెంటు కోతలు లేనందున పరిశ్రమలు విస్తరించుకోవాలని ఆయన అన్నారు. త్వరలో 24 గంటలు నాణ్యమైన కరెంటు అందిస్తామని హామీ ఇచ్చారు. సింగిల్ విండో పారిశ్రామిక విధానం ప్రపంచంలోనే అత్యుత్తమమైందని, నూతన పారిశ్రామిక విధానాన్ని త్వరలో రూపొందిస్తామని ఆయన చెప్పారు.

నూతన పారిశ్రామిక విధానం అత్యంత పారదర్శకంగా ఉంటుందని, పరిశ్రమల స్థాపన కోసం ఇక నుంచి పైరవీలు చేయాల్సిన అవసరం లేదని, 10-12 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అవసమైన అనుమతులు ఇస్తామని కెసిఆర్ వివరించారు.

జహీరాబాద్‌కు వరాల జల్లు

జహీరాబాద్ నియోజకవర్గం పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ జహీరాబాద్‌పై వరాల జల్లు కురిపించారు. జహీరాబాద్‌కు మంచినీళ్లు ఇచ్చే ప్లాంట్‌ను తానే ప్రారంభిస్తానని కేసీఆర్ తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జహీరాబాద్ మున్సిపాల్టీకి అవసరమైన నిధులు కేటాస్తామని హామీ ఇచ్చారు.

తనను ఇంత ఎత్తుకు పెంచిన మెదక్ జిల్లాకు తాను జన్మంతా రుణపడి ఉంటానన్నారు. మీ నియోజకవర్గానికి అనుభవం ఉన్న ప్రజాప్రతినిధి గీతారెడ్డి, యువకులైన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీపటేల్ మీకు ఎల్లవేలలా అందుబాటులో ఉంటారని సీఎం హామీ ఇచ్చారు.

English summary
Telangana CM K chandrasekhar Rao blamed earstwhile united Andhra Pradesh CMs for not launching projects in telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X