ఈటెలకు ఆర్థిక, హరీష్‌కు ఇరిగేషన్: కొండా సురేఖకూ?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో... కెసిఆర్ కేబినెట్లో మంత్రి పదవులపై కసరత్తు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈటెల రాజేందర్‌కు ఆర్థిక శాఖ, హరీష్ రావుకు నీటి పారుదల శాఖ, కెటిఆర్‌కు ఐటి శాఖను అప్పగించనున్నాలని సమాచారం. కెసిఆర్ 2న తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు ఏడెనిమిది మంది మంత్రులుగా తొలి విడతలో ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది.

తెలంగాణ శాసనసభలో సభ్యుల (119) సంఖ్య రీత్యా కేబినెట్‌లో ముఖ్యమంత్రి సహా 18 మంది మంత్రులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఏడెనిమిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. అయితే కెసిఆర్ లక్కీ నెంబర్ 6 కావటం వల్ల సోమవారం ఆయన కాకుండా మరో ఐదుగురు మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. లేకపోతే 14 (1+4=5) మందితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించవచ్చనే వాదన కూడా ఉంది.

KCR mulling on cabinet

మంత్రి పదవులను ఖాళీ పెడితే వచ్చే ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకొని ఒకే విడతలో 17 మందికి మంత్రి పదవులు ఇచ్చే అవకాశాలను తోసిపుచ్చలేమని కొందరు పార్టీ ముఖ్యులు అంటున్నారు. అయితే, తనతోపాటు ఎంత మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారనే సమాచారాన్ని కెసిఆర్ ఆదివారం రాత్రికి రాజ్‌భవన్‌కు తెలియజేసే అవకాశముంది. సాధారణ పరిపాలన, శాంతిభద్రతలుసహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలను తన వద్దనే ఉంచుకోవాలని కెసిఆర్ భావిస్తున్నారట.

పార్టీ తరఫున 63 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైనప్పటికీ, పలు మంత్రిత్వ శాఖలను సమర్థంగా నిర్వహించే సామర్థ్యం, భాషపై పట్టు వారిలో చాలామందికి లేదని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు వివిధ రంగాల్లో నిపుణులైన వారిని తన కేబినెట్‌లోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారని సమాచారం. అందులో భాగంగా బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆచార్యుడు ఘంటా చక్రపాణిని కెసిఆర్ మంత్రివర్గంలో చేరాలని తెరాస అధిష్ఠానం ముఖ్యులు కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను చక్రపాణి సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

అయితే ఇదే తరహాలో వివిధ రంగాల నిపుణులను తన కేబినెట్‌లో చేర్చుకునే ప్రయత్నాలను కెసిఆర్ ముమ్మరం చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను తీసుకోవటానికి పలువురు పార్టీ ఎమ్మెల్యేలు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. ఆ పదవుల కంటే కేబినెట్‌లో చేరటానికే చాలా మంది ఇష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే తొలుత స్పీకర్ పదవికి సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ పేర్లు వినిపించగా, %E

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+