వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎంతోపాటు ఆ ముగ్గురు మంత్రులే..: జగన్ సర్కారుపై కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనుగడ ఎంతో కాలం కొనసాగేలా లేదని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

న్యూ ఇయర్, సంక్రాంతికి దూరం: మనస్సు అంగీకరించడం లేదంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగంన్యూ ఇయర్, సంక్రాంతికి దూరం: మనస్సు అంగీకరించడం లేదంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగం

సీఎంతోపాటు ఆ ముగ్గురు మంత్రులే..

సీఎంతోపాటు ఆ ముగ్గురు మంత్రులే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంతోపాటు ముగ్గురు మంత్రులు తప్ప మరెవరూ సంతోషంగా లేరని కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. ఆ ముగ్గురు మంత్రులు అర్థంపర్థం లేకుండా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతి అభివృద్ధి కోసమే రైతులు భూములు ఇచ్చారని తెలిపారు.

అదే బాధగా ఉంది..

అదే బాధగా ఉంది..

విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ వాసులు ఇక్కడ్నుంచి విశాఖ వరకు వెళ్లాలా? అని ప్రశ్నించారు కేఈ కృష్ణమూర్తి. రాయలసీమను, కర్నూలును నిర్లక్ష్యం చేస్తున్నారనే బాధ తనకు ఉందని ఆయన అన్నారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాల్సిందేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏది కూడా సామరస్యంగా చేయలేకపోతోందని కేఈ వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏ కట్టడాలు అధికార పార్టీ నేతలు, మంత్రులు అన్నారని.. అయితే అక్కడ పలు నిర్మాణాలు ఇప్పటికే ఉన్నాయని తెలిపారు.

రైతుల పోరాటంలో న్యాయం ఉంది..

రైతుల పోరాటంలో న్యాయం ఉంది..

రైతులు రాజధాని కోసం 33వేల ఎకరాల భూములు ఆనందంగా ఇచ్చారని అన్నారు.
ఇప్పుడు రాజధాని కోసం తీసుకున్న ఆ భూములను వాపస్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. ఎప్పడిస్తారో తెలియదని అన్నారు. అయితే, రాజధాని అమరావతి అభివృద్ధి కోసమే తమ భూములు ఇచ్చామని రైతులు చెబుతున్నారని కేఈ అన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులు చేసే ధర్నాలో నిజంగా న్యాయం ఉందని కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు.

ఆడవాళ్లను, రైతులను కొడతావున్నారు.. మూడు రాజధానులకు డబ్బులు ఎలా?

ఆడవాళ్లను, రైతులను కొడతావున్నారు.. మూడు రాజధానులకు డబ్బులు ఎలా?

ఒక రాజధాని నిర్మాణానికే డబ్బులు లేవంటున్న ప్రభుత్వం.. మూడు రాజధానులకు డబ్బులు ఎక్కడినుంచి వస్తాయని కేఈ కృష్ణమూర్తి ప్రశ్నించారు. ప్రభుత్వం తమ వాళ్లను పెట్టుకుని ధర్నాకు వచ్చిన ఆడవాళ్లను, రైతులను కొడతావున్నారని కేఈ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని రైతులకు న్యాయం చేయాలని మాజీ డిప్యూటీ సీఎం కోరారు. కమిటీలు వేశారు కానీ, అవి ఏం చేస్తాయోనని అన్నారు. కొత్త రాష్ట్రం ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

English summary
KE Krishna murthy sensational comments on ys jagan governement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X