Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బుగ్గనకు హ్యాట్రిక్ దక్కేనా - ఆక్కడే బిగ్ ట్విస్ట్, అనూహ్యంగా..!!

ఏపీలో ఎన్నికల రాజకీయంగా ఆసక్తి కరంగా మారింది. పలు నియోజకవర్గాల్లో పోరు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. అందులో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ క ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఆర్దిక మంత్రి బుగ్గన పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కోట్ల సూర్యప్రకాశ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ సారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసేందుకు బుగ్గన ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా ఈ నియోజకవర్గంలో గెలవాలనేది టీడీపీ వ్యూహం.

డోన్ లో హోరా హోరీ
డోన్ నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఈ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిని గెలిపించిన నేల ఇది. ప్రస్తుత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి 2014, 2019ల్లో ఇక్కడి నుంచే గెలిచారు. మరోసారి బరిలోకి దిగారు. హ్యాట్రిక్‌ కొట్టేందుకు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. ఆయన్ను మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి తనయుడు, మూడు సార్లు కర్నూలు ఎంపీగా గెలిచి యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఢీకొంటున్నారు.

Keen contest on Cards in YCP leader Buggnana Vs Kotla Suryaprakash Reddy in Dhone see details

బుగ్గనకు హ్యాట్రిక్ దక్కేనా
ఇక్కడ తన గెలుపుతో కుటుంబ ప్రతిష్ఠ ముడిపడి ఉండడంతో కోట్ల విజయం కోసం వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో ఇక్కడ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. సామాజిక వర్గాల లెక్కల ప్రకారం డోన్‌లో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో 2,27,351 మంది ఓటర్లు ఉండగా.. బీసీలు దాదాపు లక్షా 7 వేల మంది ఉన్నారు. ఈసారి వైసీపీ, టీడీపీ నుంచి పోటీ పడుతున్న బుగ్గన, కోట్ల ఇద్దరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే! వీరిలో ఎవరివైపు బీసీ, ఎస్సీలు మొగ్గు చూపుతారోనన్న చర్చ సాగుతోంది. తమ ప్రభుత్వ హయాంలో చేసిన సంక్షేమం తనను గెలిపిస్తుందనే నమ్మకంతో బుగ్గన ఉన్నారు.

ఫలితం పై ఉత్కంఠ
ఇదే సమయంలో టీడీపీలో వర్గాలు ఉన్నాయి. సీటు కోసం చివరి వరకు ఆశలు పెట్టుకున్న సుబ్బారెడ్డి మద్దతు దారులు ఎంత వరకు సహకరిస్తారనేది కీలకంగా మారుతోంది. గ్రూపుల మధ్య సమన్వయం సమస్యగా మారుతోంది. కర్నూలు జిల్లాలో వైసీపీ 2019 లో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి అదే పట్టు నిరూపించుకోవాలని వైసీపీ నేతలు పట్టుదలతో ఉన్నారు. ఎలాగైనా పూర్వ వైభవం సాధించాలనేది టీడీపీ నేతలు వ్యూహాలు అమలు చేస్తున్నారు. దీంతో..జిల్లాలో డోన్ నియోజకవర్గంలో ఎవరికి విజయం దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+