Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బజారు...: లక్ష్మీపార్వతిపై కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Recommended Video

    లక్ష్మీ పార్వతి పై కేతిరెడ్డి సంచలన కామెంట్స్ ! | Filmibeat Telugu

    అమరావతి: దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీపార్వతిపై 'లక్ష్మీస్ వీరగ్రంథం' చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన కారణంగా లక్ష్మీపార్వతి అసలు క్యారెక్టర్ ఏంటో ఆంధ్రరాష్ట్ర ప్రజలకు తెలిసిందని అన్నారు.

    ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. నవంబర్ 12న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ప్రారంభించినట్లు తెలిపారు. ఆ తర్వాత ఆ ఘాట్ వద్ద అపవిత్రమైందంటూ లక్ష్మీపార్వతి పాలతో శుద్ధి చేసిన విషయంపై ఆయన స్పందించారు.

    కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

    కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

    లక్ష్మీపార్వతి ఓ బజారు వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను బజారోడని, రౌడీ అని, వెధవ అని, అంతుచూస్తానని ఆమె హెచ్చరించిందని అన్నారు.

    ఎలా అడ్డుకుంటారు?

    ఎలా అడ్డుకుంటారు?

    తాను తీసిన సినిమాను అడ్డుకుంటానని లక్ష్మీపార్వతి అంటోందని, ఏ రకంగా ఆమె అడ్డుకుంటుంది? అని కేతిరెడ్డి ప్రశ్నించారు. లక్ష్మీపార్వతి తన జీవిత చరిత్రను రాసి, దానిని ఎక్కడైనా రిజిస్టర్ చేసిందా? అని నిలదీశారు.

    లక్ష్మీ పార్వతికి ఆ హక్కు ఎక్కడిది?

    లక్ష్మీ పార్వతికి ఆ హక్కు ఎక్కడిది?

    ఒక వేళ అలా రిజిస్టర్ చేసివుంటే. అదే జీవిత చరిత్రను తాను సినిమాగా తీస్తే అడ్డుకోగల్గుతారు తప్ప, లేకపోతే తనను అడ్డుకునే హక్కు లక్ష్మీపార్వతికి లేదని స్పష్టం చేశారు. భారతదేశంలో కొన్ని లక్షల మందికి ‘లక్ష్మి' అనే పేరుంటుందని, అదే విధంగా లక్ష్మీపార్వతి జీవితంలో జరిగిన సంఘటనలు లాంటివే కొన్ని కోట్ల మంది జీవితాల్లో కూడా ఉంటాయని అన్నారు.

    నాకో మనసుంది.. దమ్ముంది...

    నాకో మనసుంది.. దమ్ముంది...

    ‘వయసు పైబడిన వ్యక్తుల జీవితంలో వారికి చేదోడు వాదోడుగా ఉండేందుకు భార్యలు అయినటువంటి వారి ఉదాహరణలు కొన్ని వేలు ఉన్నాయి. అవసరమైతే సెన్సార్‌కు, కోర్టుకు కూడా ఆ ఉదాహరణలు ఇస్తాను. నాకో మనసు ఉంది. దమ్ము ఉంది' అని కేతిరెడ్డి తేల్చి చెప్పారు.

    పిచ్చిపిచ్చిగా మాట్లాడి..

    పిచ్చిపిచ్చిగా మాట్లాడి..

    ‘లక్ష్మీపార్వతి గారూ.. నేను సినిమా తీస్తుంటే నువ్వు ఉలిక్కిపడటం ఎందుకు?, ఆ అవసరం లేదు. అన్నగారి సతీమణిగా మిమ్మల్ని గౌరవిస్తాం. మీ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. మీరేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడి.. నేనేదో రోడ్ సైడ్ వ్యక్తినని అన్నారు. మీరు ఏ రాజమహల్ నుంచి వచ్చారు? ఇందుకు మీ సమాధానమేంటి?' అని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నిలదీశారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+