దాడుల్లో గాయపడిన క్షత్రగాత్రులతో వీల్ చైర్ ర్యాలీ- కేతిరెడ్డి సంచలనం..!!

స్థానిక ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల ప్రారంభం రోజునే ఘర్షణలు జరిగాయి. మున్సిపల్ ఎన్నికలకు రేపు (ఆదివారం) చివరి రోజు. ఈ ఎన్నికలను కూటమి- వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. హోరా హోరీగా తల పడుతున్నాయి. ఇదే సమయంలో ధర్మవరం లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వినూత్న నిరసన నిర్వహించారు. దాడుల్లో గాయపడిన కార్యకర్తలతో కలిసి వీల్ ఛైర్ లో నిర్వహించిన ప్రదర్శన ఆసక్తిగా మారింది.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ఘర్షణలతో మొదలైంది. తొలి రోజునే అన్నమయ్య జిల్లా లో రాయచోటి, పుంగనూరులో వైసీపీ - టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు రాళ్ల దాడి, వాహనాల దగ్డం వరకు వెళ్లాయి. రెండు వైపులా కార్యకర్తలు గాయ పడ్డారు. పోలీసులు కేసులు నమోదు చేసారు. ఇక, అదే విధంగా సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపాల్టీలోనూ ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
అయితే.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి దాడుల్లో గాయపడిన పార్టీ కార్యకర్త లకు ప్రాధమిక చికిత్స చేయించారు. చేతికి, తలకు కట్లతో ఉన్న కార్యకర్తలను వీల్ ఛైర్ లో కూర్చోబెట్టి పట్టణంలో ప్రదర్శన చేసారు. పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు వారిని అనుసరిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేసారు.

జనసేనకు సీట్ల కేటాయింపు పై మహిళా మంత్రి కన్నీటి పర్యంతం..!!
జనసేనకు సీట్ల కేటాయింపు పై మహిళా మంత్రి కన్నీటి పర్యంతం..!!
ketireddy-leads-protest-rally-in-dharmavaram-with-injured-activists-in-wheelchairs-here-the-detail

ఎన్నికల వేళ ఆసక్తిగా మారిన నిరసన

ధర్మవరంలో కేతిరెడ్డి నిర్వహించిన ఈ ప్రదర్శన పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీలో మాత్రం ఇది కార్యకర్తలతో జోష్ పెంచింది. అందరికీ ఒక తాటి మీదకు తీసుకొచ్చింది. ఇక్కడ ఎన్నికలను కేతిరెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. రేపటితో నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానున్న వేళ.. కూటమిలో మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ సీట్ల పంపకాలు పూర్తయినా.. వార్డుల్లో మూడు పార్టీల మధ్య షేరింగ్ స్పష్టత రావాల్సి ఉంది. చాలా కార్పోరేషన్లు.. మున్సిపాలిటీల్లోనూ చర్చలు జరుగుతున్నాయి. దాడుల పైన కేతిరెడ్డి నిర్వహించిన నిరసన సందర్భోచితంగా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాగా.. రాజకీయంగా ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న వేళ చోటు చేసుకుంటున్న ఘర్షణల పైన పోలీసు యంత్రాంగం అప్రమత్తం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+