‘KGF3’ గురించి అప్ డేట్ ఇచ్చిన నిర్మాణ సంస్థ

కేజీయఫ్‌'(KGF).. సిరీస్‌ చిత్రాలు ఎటువంటి ప్రభంజనం సృష్టించాయో మనం చూశాం. సంవత్సరం క్రితం రిలీజైన 'కేజీయఫ్‌2' సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమాతో హీరో యశ్‌ (Yash) ఒక బ్రాండ్‌ నేమ్ గా మారిపోయారు. భాషతో సంబంధం లేకుండా విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఈ చిత్రం ఘన విజయం సాధించింది. కొన్ని ప్రాంతాల్లో రికార్డులు బద్ధలు కొట్టింది. దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తన పవర్‌ఫుల్‌ డైరెక్షన్‌తో కమర్షియల్‌ సినిమా అంటే 'కేజీయఫ్‌'లా ఉండాలనే స్థాయిలో ఒక ట్రెండ్ ను క్రియేట్ చేశారు.

త్వరలో కేజీఎఫ్3?
'కేజీయఫ్‌2' చిత్రం విడుదలై సంవత్సరం పూర్తయిన సందర్భంగా హోంబలే ఫిల్మ్స్‌ ఒక ప్రత్యేక వీడియో విడుదల చేసింది. '1978 నుంచి 1981 వరకు రాకీ భాయ్‌ ఎక్కడ ఉన్నారు..?'అంటూ విడుదలైన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 'కేజీయఫ్‌3' త్వరలోనే మొదలవబోతోందని హింట్‌ ఇచ్చారంటున్నారు. ఈ సందర్భంగా ఆ సినిమాలో నటించిన నటులు ట్విటర్‌ వేదికగా వారి అనుభవాలను పంచుకుంటున్నారు. 'కేజీయఫ్‌3'లో యశ్ ను ఎలా చూపించబోతున్నారనేది ఉత్కంఠగా మారింది.

 kgf

'కేజీయఫ్‌' లుక్‌లో యశ్‌
కొన్నిరోజుల తర్వాత తన సినిమా అప్‌డేట్‌ చెబుతానని యశ్‌ ఇటీవల తెలిపారు. తాజాగా ఆయన ఓ టీవీ ప్రకటనలో కూడా 'కేజీయఫ్‌' లుక్‌లోనే మెరిశారు. త్వరలోనే 'కేజీయఫ్‌3'కి (KGF Chapter 3) సంబంధించిన ప్రకటన చేస్తారని ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం 'సలార్‌'తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తికాగానే ఎన్టీఆర్‌తో ఓ చిత్రం చేయబోతున్నారు. దానితర్వాతే 'కేజీయఫ్‌3' మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+