హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ పని: ఖైరతాబాద్ గణపతిపై గులాబీలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సూచన మేరకు ఖైరతాబాద్ మహాగణపితిపై గులాబీల వర్షం కురిసింది. చార్టర్డ్ విమానం ద్వారా 3 క్వింటాళ్ల గులాబీపూలను గణేశుడిపై చల్లినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం సిపిఆర్వో ఒక ప్రకటనలో తెలిపారు. నగర పోలీసుల ఆధ్వర్యంలో చార్టర్డ్ విమానం ఐదుసార్లు చక్కర్లు కొట్టిందని ఆ ప్రకటనలో తెలిపారు.

ఖైరతాబాద్‌ మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు తుది దశకు చేరుకుంది. మహాగణపతి నిమజ్జనం కోసం భారీ క్రేన్‌ ఖైరతాబాద్‌ గణేషుడి మండపం వద్దకు చేరుకుంది. మరోవైపు మహాగణపతి నిమజ్జనం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో అక్కడ సందడి వాతావరణ నెలకొంది. భక్తులపై పోలీసులు లాఠీలు కూడా ప్రయోగించాల్సి వచ్చింది.

ఖైరతాబాద్ మహా గణపతి మరి కొద్ది గంటల్లో సాగర తీరానికి బయలుదేరాడు. సాగర తీరానికి బయల్దేరే ముందు సాయంత్రం 5 గంటలకు గణేషుడిపై హెలీకాఫ్టర్‌ ద్వారా ప్రభుత్వం పూలవర్షం కురిసింది. పూల వర్షాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

ఖైరతాబాద్ గణపతి వద్ద సందడి...

ఖైరతాబాద్ గణపతి వద్ద సందడి...

ఖైరతాబాద్ గణపతిని దర్శించేందుకు పెద్ద యెత్తున భక్తులు తరలి వచ్చారు. వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.

కెసిఆర్ హామీతో పెద్ద యెత్తున

కెసిఆర్ హామీతో పెద్ద యెత్తున

ఖైరతాబాద్ గణపతిపై పైనుంచి పూలవర్షం కురిపిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హామీ ఇవ్వడంతో దాన్ని చూడడానికి పెద్ద యెత్తున ప్రజలు తరలివచ్చారు.

ఖైరతాబాద్ గణేశుడు సిద్ధం

ఖైరతాబాద్ గణేశుడు సిద్ధం

హుస్సేన్ సాగర్ తరలేందుకు ఖైరతాబాద్ గణేశుడిని సిద్ధం చేశారు. ఈ గణపతి నిమజ్జనంతో వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తవుతుంది.

క్రేన్ రెడీ ఇలా...

క్రేన్ రెడీ ఇలా...

ఖైరతాబాద్ గణపతిని హుస్సేన్ సాగర్ తరలించేందుకు భారీ క్రేన్‌ను సిద్ధం చేశారు. చివరగా ఈ విగ్రహం నిమజ్జనానికి తరలుతుంది.

ఇలా ప్రజలు చేరారు...

ఇలా ప్రజలు చేరారు...

ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని దర్శించేందుకు ప్రజలు పెద్ద యెత్తున తరలి వచ్చారు. ఇలా ఇరువైపులా సందడి చోటు చేసుకుంది.

ఖైరతాబాద్ గణపతి వద్ద...

ఖైరతాబాద్ గణపతి వద్ద...

ఖైరతాబాద్ గణపతికి భక్తులు పూజలు చేశారు. భక్తులు ఖైరతాబాద్ గణపతి విగ్రహాన్ని చూసి తన్మయులయ్యారు.

English summary
Heavy Crowd at Khairathabad Ganesh and Organisers Removing the Shed to Clear the Transportation the Ganesh in Early Hours to Immersion
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X