మార్కెట్ లోకి కియా సెల్టోస్... అదిరిన ఫీచర్లు
ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా ఇండియా (Kia India) సరికొత్త ఫీచర్లతో కొత్త తరం సెల్టోస్‌ను అందుబాటులోకి తెచ్చింది. 2023 సెల్టోస్‌ను ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ పరంగా పలు మార్పులు చేయడంతోపాటు కొత్త ఫీచర్లను జోడించారు. దీని బుకింగ్స్ జులై 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ధరను కంపెనీ వెల్లడించలేదు.
కొత్త కియా సెల్టోస్ మూడు వేరియంట్లలో (ఎక్స్‌లైన్, జీటీ లైన్, టెక్ లైన్) లభిస్తుంది. రెండు మ్యాటీ గ్రాఫైట్ ఫినిష్ కలర్ ఆప్షన్స్‌తో కలిపి మొత్తం ఎనిమిది రంగుల్లో లభిస్తోంది. సరికొత్త ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్స్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్స్ కొత్త కియా సెల్టోస్ ఎక్స్ టీరియర్ లో హైలైట్ అవుతాయి. డ్యూయల్ ఎగ్జాస్ట్‌తో, ఇంటీరియర్ బ్లాక్/ గ్రే; బ్లాక్/ క్యామెల్ బ్రౌన్ డ్యూయల్ టోన్ ఇంటీరియర్ థీమ్‌తో కియా దీన్ని రెడీ చేసింది.

10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లసర్, వాయిస్ కంట్రోల్‌తో పనిచేసే పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది. 8 స్పీకర్లతో బాష్ ఆడియో సిస్టమ్, ఎయిర్ ప్యూరిఫయర్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ వంటి సదుపాయాలున్నాయి.
1.5 లీటర్ ఎన్‌ఏ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లలో లభిస్తోంది. ఐఎంటీ, సెవన్ స్పీడ్ డీసీటీ ట్రాన్స్‌మిషన్, సిక్స్ స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆప్షన్లున్నాయి. భద్రత పరంగా చూస్తే కొత్త సెల్టోస్‌లో ADAS లెవల్-2తో పాటు లేన్ కీప్ అసిస్టెంట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఎమర్జెన్సీ వంటి 17 అటానమస్ ఫీచర్లు, ఆటో క్రూయిజ్ కంట్రోల్ ఉండటంతోపాటు సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ అసిస్టెంట్ వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా కొత్త కియా సెల్టోస్ లో ఉన్నాయి.












Click it and Unblock the Notifications