వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్ పార్టీపై డిఎల్: బౌలింగ్, బ్యాటింగ్ లేదని విజయమ్మ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran will not float new party
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ పెడతారని తాను భావించడం లేదని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యుడు డిఎల్ రవీంద్రా రెడ్డి గురువారం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీ బలహీనపడడానికి అధిష్టానమే కారణమన్నారు. కిరణ్ పార్టీ పెడతారనే ఆశాభావంతో తమ పార్టీకి చెందిన మాజీ మంత్రులు జెసి దివాకర్ రెడ్డి, గాదె వెంకట రెడ్డిలు ఆశాభావంతో ఉన్నారన్నారు.

ఒక్క తప్పు జరిగినంత మాత్రాన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు. సోనియాను నాయకత్వ బాధ్యతల నుండి తప్పుకోవాలని చెప్పడం సరికాదన్నారు. కడపలో ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని తాను కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌కు లేఖ రాసినట్లు చెప్పారు.

బాబు బాల్ వేయరు.. కిరణ్ బ్యాటింగ్ చేయరు: విజయమ్మ

విభజన అంశంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన మండిపడ్డారు. విభజన జరిగే వరకు చంద్రబాబు బాల్ వేయరని, కిరణ్ బ్యాటింగ్ చేయరన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని తాము ఆరు నెలలుగా కోరుతున్నామన్నారు. విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన తర్వాత ఇప్పుడు సమైక్య తీర్మానం కుదరదంటూ కిరణ్ విడ్డూరంగా మాట్లాడుతున్నారన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులు కట్టి ఉంటే రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదని బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు అంశంపై అన్నారు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి ఎప్పటికి అప్పుడు తన సిద్ధాంతాలను మార్చుకున్నారని ఆరోపించారు.

English summary
Congress Party senior leader and Former Minister DL Ravindra Reddy on Thursday said CM Kiran Kumar Reddy will not float New party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X