కేకే సర్వే కిరణ్ సంచలనం- ఏపీ స్థానిక పోరులో పోటీకి అభ్యర్ధులు..!

గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఎవరు గెలుస్తారో కచ్చితంగా సర్వే చేసి చెప్పి సంచలనం సృష్టించిన కేకే సర్వే అధినేత కిరణ్ కొండేటి (KK Survey Kiran) ఇవాళ అనూహ్య ప్రకటన చేశారు. ఏపీలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అభ్యర్ధుల్ని నిలబెట్టబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సమస్యలపై లోతుగా అధ్యయనం చేశామని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన సర్వేలో తేలిన విషయాల్ని కూడా కిరణ్ వెల్లడించారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఏకం పేరుతో లక్షా అరవై వేల మందిని సిద్దం చేస్తున్నట్లు కేకే సర్వే కిరణ్ ప్రకటించారు.

AP Local Body Elections: ఏపీ స్థానిక ఎన్నికలు 2 నెలల ఆలస్యం? ఎస్ఈసీ క్లారిటీ..!
AP Local Body Elections: ఏపీ స్థానిక ఎన్నికలు 2 నెలల ఆలస్యం? ఎస్ఈసీ క్లారిటీ..!

ఏపీ వ్యాప్తంగా అన్ని స్థానాల్లో అభ్యర్దులను నిలిపేందుకు సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు. 2014, 2019, 2024 నుంచి నేటి వరకు అవే సమస్యలు ఇంకా రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వాలు, పాలకులు, మంత్రులు, అధికారులు మారినా.. సమస్యలు మాత్రం మారలేదన్నారు. మంచినీరు, దోమలు, సమస్యలు ఉన్నాయని, కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు అయినా అవే సమస్యలతో ప్రజలు బాధలు పడుతున్నారని కిరణ్ పేర్కొన్నారు. తన సర్వే లో కూడా ఇలాంటి సమస్యలనే ప్రజలు ప్రస్తావించారని తెలిపారు. తాను ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో పర్యటించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నానని కిరణ్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలలో డోలి కట్టుకుని గర్భిణీని తీసుకు వెళితేనే ప్రసవం అయ్యే పరిస్థితి ఇంకా ఉందన్నారు. సూపర్ సిక్స్ లు, ఉచిత పధకాలు ను ప్రజలు కోరడం లేదన్నారు. మంచి విద్య, మంచి వైద్యం ప్రజలు కోరుతున్నారన్నారు. కానీ అన్ని పార్టీలు ప్రజల ప్రాధాన్యతలను మరచిపోతున్నారని తెలిపారు.

KK Survey Kiran Announces Ekam to Field Candidates in AP Local Body Elections
AP SIR: ఏపీ ఎస్ఐఆర్-ఈసీ కీలక ఆదేశాలు జారీ- సీఈఓ ప్రకటన..!
AP SIR: ఏపీ ఎస్ఐఆర్-ఈసీ కీలక ఆదేశాలు జారీ- సీఈఓ ప్రకటన..!

గతంలో ఇచ్చిన పధకాలను మళ్లీ పెంచుకుంటూనే పోతున్నారు తప్ప.. అసలు సమస్యలు పరిష్కారంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదన్నారు. ప్రజలు కోరుకునే విధంగా ప్రభుత్వాల పని తీరు ఉండటం లేదన్నారు. ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపైనా తాము సర్వే చేశామన్నారు. ఈ ఎన్నికల వల్ల ప్రభుత్వాలు మారవని, కేవలం స్థానికంగా ఉండే సమస్యలను పరిష్కరించే వారినే ప్రజలు గుర్తిస్తారన్నారు. ఈ ఎన్నికలలో పార్టీల కన్నా వ్యక్తుల ప్రాభవం ఎక్కువగా ఉంటుందన్నారు. విశాఖలో వాయి కాలుష్యం పై ప్రజల్లో ఆందోళన ఉందని, గాలి పీలిస్తే చనిపోయే నగరాల్లో విశాఖ ముందు వరుసలో ఉందన్నారు. గుంటూరు కార్పోషన్లో సిబ్బంది లేరని, 16 వేలకు పైగా స్కూళ్లలో సింగిల్ టీచర్స్ ఉన్నారని తెలిపారు. యువత నిరుద్యోగంలో 16.2 శాతం ఉందని, ఇది రోజురోజుకు పెరిగిపోతుందని తెలిపారు. లక్షా అరవై వేల మంది ఈసారి స్వచ్చందంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఇటువంటి వారిని కలిపి ఏకం చేసి ఒకే మాట, ఒకే నినాదంతో ఎన్నికలలో దిగేలా చేస్తామన్నారు. తాను వారందరికి మద్దతుగా నిలబడీ గెలిపించాలని కోరతామన్నారు. జాయిన్ ఏకం వెబ్ సైట్ అందుబాటులోకి తెచ్చామని, పోటీ చేసే వారు అందులో జాయిన్ కావాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+