పకోడీగాళ్లకు సలహా ఇవ్వాలని చెప్పా: కొడాలి నాని
రాజకీయంగా చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు బాగా తెలుసని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిరంజీవి అభిమానులకు పంచారు.
తాను శ్రీరామ అన్నా తెలుగుదేశం, జనసేన పార్టీలకు బూతు మాటలుగా వినపడుతున్నాయని, తానేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసన్నారు. తామంతా క్లారిటీ గానే ఉన్నామని, రాజకీయంగా చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసన్నారు. తాను చిరంజీవిని విమర్శించినట్లు నిరూపించాలని ఛాలెంజ్ విసిరారు.

జగన్ గురించి, తన గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతానని, ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కానన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో, టిడిపి జనసేన శ్రేణులు గుడివాడ రోడ్లు మీద దొర్లారని, చిరంజీవికి ,తమకు మధ్య అగాధం సృష్టించాలని ఆ రెండు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో కొడాలి నాని..!!#KodaliNani #MegastarChiranjeevi #Chiranjeevi #Vashista #Mega157 #HBDChiranjeevi #HBDMegastarChiranjeevi #HappyBirthdayChiranjeevi #HappyBirthdayMegastar #Oneindiatelugu pic.twitter.com/nVO28018Lm
— oneindiatelugu (@oneindiatelugu) August 22, 2023
ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు తన కార్యాలయం మీదుగా చిరంజీవి ర్యాలీగా వెళ్లారని, ఆ సమయంలో తాను ఆయనకు చేతులెత్తి నమస్కారం పెట్టానన్నారు. అనేక సందర్భాల్లో తాను చిరంజీవిని కలిసినట్లు చెప్పుకొచ్చారు. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామన్నారు. తమకు ఇచ్చినట్లే.... డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే చెప్పానని, ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదా.... నేను ఆయన గురించి మాట్లాడినట్లు ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. తన వెంట ఉన్న వ్యక్తుల్లో 60 శాతం చిరంజీవి అభిమానులే ఉంటారన్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ!












Click it and Unblock the Notifications