రజనీకాంత్ ఎంట్రీ వెనుక చంద్రబాబు బిగ్ ప్లాన్, పవన్ బీ అలర్ట్ - కొడాలి నాని..!!
సూపర్ స్టార్ రజనీకాంత్ ను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. వరుసగా వైసీపీ ఫైర్ బ్రాండ్స్ రజనీకాంత్ లక్ష్యంగా తీవ్ర విమర్శలకు దిగారు. తాజాగా విజయవాడలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో రజనీకాంత్ ఎన్టీఆర్ తో తన అనుబంధం వివరిస్తూనే చంద్రబాబు పైన ప్రశంసలు గుప్పించారు. చంద్రబాబు విజన్ అమలైతే ఏపీకి మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. రాజకీయాలు మాట్లాడను అంటూనే చంద్రబాబు పైన ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని రజనీకాంత్ పై కీలక వ్యాఖ్యలు చేసారు.
రజనీకాంత్ విజయవాడలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యల పై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. రజనీ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు గురించి రజనీ చెప్పిన విషయాలపైన ఫైర్ అయ్యారు. ఏపీలో జీరో అయిన రజినీకాంత్, సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నాడని మండిపడ్డారు.
ఎన్టీఆర్ పై చెప్పులు విసుగుతుండగా, వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు రజనీకాంత్ వెళ్లి మద్దతు పెళ్లి తెలిపారని గుర్తు చేసారు. ఇప్పుడు ఎన్టీఆర్ ను పొగడడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వీళ్లంతా కలిసి ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు చేస్తే ప్రజలెవరూ పట్టించోరని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదువుతూ రజనీకాంత్ దిగజారుతున్నారని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే టీడీపీ అధినేత చంద్రబాబు రజినీకాంత్ ను రంగంలోకి దించారని కొడాలి నాని కొత్త వాదన తీసుకొచ్చారు. చంద్రబాబు రాజకీయాలను ఇకనైనా పవన్ కళ్యాణ్ గ్రహించాలని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ బతికుండగా రజిని ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారని నిలదీసారు.
మూడు రోజులు షూటింగ్ చేస్తే రజనీకాంత్ నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంటారని, అటువంటి వ్యక్తి తెలుగు ప్రజలకేం చెబుతారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. మంత్రి రోజా సైతం ఇదే తరహాలో రజనీకాంత్ పైన ఫైర్ అయ్యారు. రజనీకాంత్ లక్ష్యంగా వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications