పవన్ - జూ ఎన్టీఆర్ కు పూర్తి క్లారిటీ ఉంది : జరిగేదిదే - కొడాలి నాని..!!

టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రీ ఎంట్రీపై మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు.

టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ రీ ఎంట్రీపై మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేసారు. టీడీపీ నేత నారా లోకేష్ యువగళంలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. దీని పైన కొడాలి నాని స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ తాత పార్టీ స్థాపించి...హరిక్రిష్ణ చైతన్య రధం సారధ్యం వహిస్తే ఇప్పుడు లోకేష్ కొత్తగా జూ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించటం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ కి అవసరమైతే చంద్రబాబు - లోకేష్ ఎలా ఆహ్వానిస్తారో..అవసరం లేకపోతే ఎలా వ్యవహరిస్తారో పవన్ తో పాటుగా జూనియర్ ఎన్టీఆర్ కు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ అప్పగిస్తే ఏం జరుగుతుందో వివరించారు. ఎవరు కలిసినా..ఎవరొచ్చినా వైసీపీని ఓడించటం సాధ్యం కాదని కొడాలి నాని తేల్చి చెప్పారు.

జరిగిందిదే..జరిగేదిదే

జరిగిందిదే..జరిగేదిదే


పార్టీ అధికారంలోకి రావలంటే టీడీపీకి పవన్ కల్యాణ్ - జూ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎవరి మద్దతు లేకుండా సొంతంగా గెలిచే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. గతంలోనూ అధికారం కోసం అందరి మద్దతు కూడగట్టారని ఎద్దేవా చేసారు. అసవరమైతే పిలుస్తాము..అవసరం లేదనుకుంటే నెట్టేస్తాం అనే విధంగా చంద్రబాబు - లోకేష్ వ్యవహార శైలి ఉంటుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎవరిని ఎలా వాడుకుంటారో బీజేపీ..పవన్ కల్యాణ్..జూనియర్ ఎన్టీఆర్ కు బాగా తెలుసని కొడాలి పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రకు స్పందన లేదన్నారు. ముఖ్యమంత్రిని దూషిస్తూ అక్కడక్కడా సమావేశాలు ఏర్పాటు చేసుకొని వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. లోకేష్ తానే ప్రశ్నలు వేయించి..తానే ముందుగా సిద్దం చేసుకున్న సమాధానాలు చెబుతూ అందులో భాగంగా జూనియర్ ను ఆహ్వానించారని కొడాలి నాని చెప్పుకొచ్చారు.

పవన్ ను చంద్రబాబు ఆహ్వానించారు

పవన్ ను చంద్రబాబు ఆహ్వానించారు


విజయవాడ నోవాటెల్ లో కలిసిన సమయంలోనే చంద్రబాబు నాడు పవన్ తో పొత్తుతో కలిసి వెళ్దామని ఆహ్వానించారని కొడాలి నాని చెప్పారు. హైదరాబాద్ లో తన ఇంటికి ఆహ్వానించారన్నారు. పవన్ ను ఒప్పించారని..ఢిల్లీలో బీజేపీలో తన బ్యాచ్ ను పంపి అక్కడ పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎంత మంది కలిసినా.. సీఎం జగన్ కు ఎందుకు ఓటు వేయకూడదో..వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేసారు. ఏపీలోనూ టీడీపీకి వచ్చే ఎన్నికల తరువాత తెలంగాణలో పార్టీ పరిస్థితే వస్తుందన్నారు. బీజేపీ - జనసేన కలిసి పోటీ చేస్తే టీడీపీకి ప్రతిపక్ష హోదా కూదా దక్కదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. ప్రజల్లో మద్దతు లేని కారణంగానే అందరినీ తమకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నారని నాని పేర్కొన్నారు.

జూ ఎన్టీఆర్ కు అప్పగిస్తే పార్టీ నిలుస్తుంది

జూ ఎన్టీఆర్ కు అప్పగిస్తే పార్టీ నిలుస్తుంది

జూ ఎన్టీఆర్ టీడీపీ కోసం 2009లో ప్రచారం చేసి.. యాక్సిడెంట్ లో ప్రాణాలో పోగొట్టుకొనే పరిస్థితికి వెళ్లారని నాని చెప్పుకొచ్చారు. అటువంటి జూనియర్ ఎన్టీఆర్ ను 2014లో గెలిచిన తరువాత గ్యాలరీలో కూర్చో బెట్టి అవమానించారని పేర్కొన్నారు. టీడీపీకి కనీసం ప్రతిపక్ష హోదా రావాలంటే జూ ఎన్టీఆర్ కు పార్టీ అప్పగించాలని సూచించారు. జూనియర్ కు పార్టీ అప్పగిస్తే కొన్నేళ్ల పాటు పార్టీ ఉంటుందని విశ్లేషించారు. చంద్రబాబు - లోకేష్ విశ్వసనీయత కోల్పోయిన కారణంగానే 23 సీట్లు..మంగళగిరిలో ఓటమి తప్పలేదన్నారు. ఆ పార్టీకి జూనియర్ మద్దతు ఇస్తారా లేదా అనేది ఆయన ఇష్టమని చెప్పారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమం తో ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా..ఎవరెవరు కలిసి వచ్చినా ఉపయోగం లేదని కొడాలి నాని ధీమా వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+