టీడీపీకి తన మార్క్ కౌంటర్ వీడియో రిలీజ్ చేసిన కొడాలి నాని
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్యం బాలేదని ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వెలిశాయి. ముఖ్యంగా టీడీపీ అనుకూల మీడియాలో కొడాలి నానికి ఆరోగ్యం బాలేదని..ఆయనకు ఆపరేషన్ జరిగిందంటూ ప్రచారం జరిగింది. ఫలితాలు చూడకుండానే ఆస్పత్రిలో చేరడంపై టీడీపీ శ్రేణులు కొడాలి నానిపై పోస్టులు షేర్ చేశారు. అయితే ఇదింతా ప్రచారమే అని కొడాలి నాని తేల్చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆయన ప్రకటించారు.
— Kodali Nani (@IamKodaliNani) May 23, 2024
తన ఆరోగ్యం పై వస్తున్న వార్తలకు ఓ వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేసి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. తన నివాసంలో సోఫాలో కూర్చుని సెల్ ఫోన్ చూస్తూ ఉన్న వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేయడం జరిగింది.ఆ వీడియోలో ఆరోగ్యంగా శుభ్రంగా సోఫాలో కూర్చుని సేదతీరుతూ కనిపించడం జరిగింది. దీంతో తన ఆరోగ్యంపై వస్తోన్న రూమర్లకు కొడాలి నాని తనదైనశైలిలో కౌంటరించ్చారు.గుడివాడ నియోజకవర్గంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలవడం జరిగింది. రెండుసార్లు టీడీపీ. మరో రెండుసార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారాయన.

మరోసారి గెలిచి గుడివాడలో తన పట్టు నిలుపుకోవాలని కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి ఎన్నికలను కొడాలి నాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రచారంలో భారీ ఎత్తున పాల్గొని అన్ని వర్గాల ప్రజలను పలకరించారు. టీడీపీ నుండి వెనిగండ్ల రాము పోటీ చేయటం జరిగింది.ఇటీవల జరిగిన ఎన్నికలలో ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది.మరి గుడివాడ ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి.












Click it and Unblock the Notifications