కోడెల మృతిపై శివరాం స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన టీ పోలీసులు: ఏం చెప్పారంటే?
హైదరాబాద్: టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో తెలంగాణ పోలీసులు కోడెల కుటుంబసభ్యుల స్టేట్‌మెంట్లను రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గుంటూరు చేరుకుని కోడెల ప్రసాదరావు కుమారుడు శివరాంను విచారించారు. కోడెల మృతికి గల కారణాలపై ఆరా తీసినట్లు సమాచారం.
ఇప్పటికే ఇంట్లో పనివాళ్లు, గన్‌మెన్‌లను విచారించి పోలీసులు స్టేట్‌మెంట్ నమోదు చేశారు. కోడెల ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కోడెల కుమారుడు, కుమార్తెకు కూడా గతంలోనే తెలంగాణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, తండ్రి అపకర్మలు నిర్వర్తించాల్సి ఉన్నందున సమయం కోరారు కోడెల శివరాం.

ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులే గుంటూరుకు వచ్చి కోడెల శివరాంను విచారణకు పిలిపించారు. తన తండ్రి కోడెల శివప్రసాదరావు ఏపీ సర్కారు పెట్టిన కేసుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నారని కోడెల శివరాం పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పినట్లు సమాచారం. తన తండ్రి ఆత్మహత్య చేసుకునే ముందే తాను విదేశాలకు వెళ్లానని, తనకు తన కుటుంబసభ్యులు చెబితేనే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలిసిందని చెప్పినట్లు సమాచారం.
తమ తండ్రితో ఎలాంటి గోడవలు లేవని శివరాం చెప్పారు. కోడెల శివప్రసాదరావు భార్య నుంచి కూడా తెలంగాణ పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. కేసుల ఒత్తిడి కారణంగానే తన భర్త చనిపోయారని కోడెల భార్య చెప్పినట్లు తెలిసింది. తన భర్త ఎప్పుడూ దేనికీ భయపడే వ్యక్తి కాదని ఆమె చెప్పినట్లు సమాచారం. తన భర్తను కేసులతో ఇబ్బంది పెట్టారని ఆమె చెప్పారు.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
వరంగల్ లో ఆ పోలీస్ స్టేషన్ అంతే.. ఎస్సైపై సస్పెన్షన్ వేటు! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications