నాగబాబు కూతురు నీహారిక జాతకం చెప్పిన వేణుస్వామి?
నాగబాబు కుమార్తె కొణిదెల నీహారిక - జొన్నలగడ్డ చైతన్య విడాకుల వార్త రెండురోజుల నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ అంశానికి మరో వార్తను నెటిజన్లు జోడించారు. సెలబ్రిటీల జాతకాలు చెప్పే వేణుస్వామి గతంలోనే నిహారిక జాతకం చెప్పాడంటూ కామెంట్లు పెడుతున్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకుంటారని వేణుస్వామి ముందే చెప్పాడంటున్నారు.
ఆమె జీవితంలో దోషాలు ఎక్కువగా ఉన్నాయని, దీనివల్లే విడాకులు తీసుకునే పరిస్థితి వచ్చిందని, ఈ మెగా డాటర్ మళ్లీ వివాహం చేసుకున్నప్పటికీ సంతానం కలగడం చాలా కష్టమని వేణుస్వామి చెప్పినట్లుగా నీహారిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పార్టీలు, వెకేషన్స్ అంటూ తరుచుగా నీహారిక స్నేహితులతో ఎంజాయ్ చేస్తుంటుందని, మొదటి నుంచి సినీ పరిశ్రమకు చెందిన అమ్మాయి కావడంతో సాంప్రదాయం, కట్టుబాట్లు సెట్ అవలేకపోయానని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. వేణుస్వామి చెప్పినట్లుగానే సమంత-నాగచైతన్య విడాకులు తీసుకున్నారని, అలాగే నీహారిక కూడా విడాకులు తీసుకుంటారని ముందే చెప్పారంటున్నారు.

వేణుస్వామి సినీ సెలబ్రిటీల విషయంలో చెబుతున్న సంఘటనలన్నీ వాస్తవాలవుతుండటంతో పరిహారాల కోసం ఆయన్ను ఆశ్రయించేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. రష్మిక, నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు దోష పరిహారానికి పూజలు చేయించుకున్నారు. తాజాగా రామబాణం, ఖిలాడి సినిమాల్లో కథానాయికగా నటించిన డింపుల్ హయతి కూడా వేణుస్వామిచేత పూజలు చేయించుకుంది. ఆమెకు పూజల చేసే సమయంలో వైన్ బాటిల్స్ పెట్టడం నెట్టింట్ హాట్ టాపిక్ గా మారింది.












Click it and Unblock the Notifications