కొణిదెల వారి పెళ్ళిసందడి: ఇటలీ వెళ్లిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ!!
మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ల పెళ్లికి సమయం దగ్గర పడింది. ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనుంది. ఇక వీరు పెళ్లి చేసుకోవడానికి ఇటలీలోని టుస్కానీని ఎంపిక చేసుకుంది. ఇటలీలోని టుస్కానీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఎంతో ప్రసిద్ధిగాంచింది.
అక్కడ ఈ జంట వారి కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య మూడు ముళ్ళ సాక్షిగా ఒకటి కానుంది. నవంబర్ 1వ తేదీన వీరు పెళ్లి చేసుకోనున్న నేపథ్యంలో హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈరోజు ఇటలీకి బయలుదేరారు.

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లతోపాటు పంజా వైష్ణవి తేజ్, నిహారిక కొణిదలతో పాటు కొందరు కుటుంబ సభ్యులు కూడా ఇటలీ వెళ్లడం విశేషం. కొణిదెల, త్రిపాఠి, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ ఇటలీ వెళతారు. ఇక వీరిద్దరి పెళ్ళికి వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్, నిహారిక మరియు లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా హాజరు కానున్నారు.
ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీ ల పెళ్లికి ముందు 30వ తేదీన మెహందీ, హల్దీ వేడుకలు జరగనున్నాయి. నవంబర్ ఒకటవ తేదీన టుస్కానీ లో ఈ జంట బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోనుంది. పెళ్లి తర్వాత మళ్లీ వీళ్ళు హైదరాబాద్ కి తిరిగి వచ్చిన తర్వాత నవంబర్ ఐదవ తేదీన మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో రిసెప్షన్ అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు.
మొత్తానికి కొణిదెల వారి పెళ్లి సందడి మొదలు కావడంతో మెగా ఫ్యామిలీలో అందరూ రెట్టించిన ఉత్సాహంతో ఇటలీకి బయలుదేరుతున్నారు. వచ్చే గురువారం రాత్రి ఇద్దరు పెళ్ళితో ఒక్కటి కాబోతున్నారు. ఇదిలా ఉంటే జూన్ 9 నెల లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ల నిశ్చితార్థం జరగగా నవంబర్ ఒకటవ తేదీన వీరు పెళ్లి జరగబోతుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి ల వివాహానికి అతి తక్కువ మందిని ఆహ్వానించగా, రిసెప్షన్ కు ఇండస్ట్రీలోని ప్రముఖులకు ఆహ్వానాలు పంపినట్టు సమాచారం.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications