వ్యభిచారం చేస్తూ పట్టుబడిన డీఎఫ్ వో...మహిళతో సహా అరెస్ట్..కర్నూలు జిల్లాలో కలకలం...
కర్నూలు జిల్లా అటవీ శాఖ నిఘా విభాగం అధికారం వెంకటేశ్వరరావు వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన అటవీ శాఖలో చర్చనీయాంశంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాధికారులు రాసలీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రెండు రోజుల క్రితం తెలంగాణాలో పోలీసు శాఖకు చెందిన మహిళా ఏఎస్పీ- సిఐ ఏకాంతంగా ఉండి కుటుంబ సభ్యులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం మరిచిపోక ముందే ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో మరో అధికారి రాసలీలల గుట్టు రట్టయింది. కర్నూలు జిల్లా అటవీ శాఖ నిఘా విభాగం అధికారం వెంకటేశ్వరరావు వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది.

కర్నూలు పారెస్ట్ డిపార్ మెంట్ నిఘా విభాగం అధికారిగా పనిచేస్తున్న బి.వెంకటేశ్వరరావు ఒక మహిళతో వ్యభిచారానికి పాల్పడుతూ ఉండగా విద్యార్థి సంఘాలకు అడ్డంగా బుక్కయ్యారు. డిఎఫ్ వో వెంకటేశ్వరరావు నగర శివారులోని ఓ గెస్ట్‌హౌస్‌లో వేరే మహిళతో ఉండగా చూసిన విద్యార్థి సంఘాల నాయకులు దాడిచేసి ఇద్దర్నీ పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన గెస్ట్‌హౌస్‌కు చేరుకుని ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు.
అయితే వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులకు, వెంకటేశ్వరరావుకు మధ్య హై డ్రామా నడిచింది. వెంకటేశ్వరరావు మహిళతో లోపల ఉన్న విషయం తెలిసి పోలీసులు ఆయన్ను బైటకు రావాలని కోరగా, ఆయన బైటకు వచ్చేందుకు నిరాకరించారు. ఇలా సుమారు 5 గంటల పాటు డిఎఫ్ వో బైటకు రాకపోవడంతో చివరకు పోలీసులు బలవంతంగా తలుపులు తెరిచి డిఎఫ్ వో ను ఆయనతో ఉన్న మహిళను ఇద్దర్నీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications