జగన్ అరెస్ట్.. బాంబు పేల్చిన కూటమి

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న మద్యం కుంభకోణం కేసులో త్వరలో "అతిపెద్ద తిమింగలం" బయటపడనుందని మంత్రి కొల్లు రవీంద్ర చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలో జరిగిన 'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో పాల్గొన్న కొల్లు రవీంద్ర, ప్రస్తుతం బయటపడుతున్నవి చిన్న తిమింగలాలేనని, ఇది దేశంలోనే అతిపెద్ద మద్యం కుంభకోణం అని అభిప్రాయపడ్డారు. ఈ కుంభకోణంలో జరిగిన అవినీతిని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారని ఆయన పేర్కొన్నారు.

గత ఐదేళ్ల పాలన అరాచకంగా సాగిందని, అభివృద్ధి కుంటుపడిందని, రాష్ట్రం 10 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయిందని కొల్లు రవీంద్ర విమర్శించారు. పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టులు నిలిచిపోయాయని, అక్రమ అరెస్టులు, దౌర్జన్యాలు, దోపిడీలు పెరిగిపోయాయని అన్నారు. తనను కూడా 53 రోజులు అక్రమంగా జైల్లో ఉంచారని గుర్తుచేశారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారని, నిలిచిపోయిన ప్రాజెక్టులను తిరిగి ప్రారంభిస్తున్నారని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి కుయుక్తులు పన్నుతున్నారని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 200కు పైగా తప్పుడు మెయిల్స్ చేశారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.

kutami MLAs response to liquor scam key comments saying Jagan s arrest is inevitable

మరోవైపు, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జోస్యం చెప్పారు. మద్యం కుంభకోణం జగన్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తూ, ఆయన పాత్రపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతల అరెస్ట్‌లకు చంద్రబాబుకు సంబంధం లేదని, మద్యం పాలసీని ఆమోదించిన వారిని విచారించాలని, బాధ్యులపై సిట్ చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమే అని, రూ. 3,200 కోట్ల స్కాం ఇంకా పెద్ద ఎత్తున ఉందని అన్నారు. తవ్వే కొద్దీ మరిన్ని విషయాలు బయటకు వస్తాయని, అన్ని దారులు తాడేపల్లి వైపే చూపిస్తున్నాయని అన్నారు. "తాడేపల్లి ప్యాలెస్ గేటు వరకు వెళ్లి అక్కడ ఆగిపోతున్నాయి" అంటూ పరోక్షంగా జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2019లో ప్రజలపై "నేనున్నా" అంటూ దొంగప్రేమ నటించిన వారు ఇప్పుడు ఇంటికి వెళ్లాల్సి వచ్చిందని విష్ణు కుమార్ రాజు ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+