బీజేపీకి షాక్: కేవీపీ హక్కుల నోటీసు, హాల్లో జైట్లీ రహస్యం చెప్పారని జైరాం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సభ్యులు తాను ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా ప్రయివేటు మెంబర్ బిల్లును ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకున్నారని, తద్వారా సభ్యుడి హక్కులను కాలరాశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు మంగళవారం నాడు సభా హక్కుల నోటీసు ఇచ్చారు.

KVP privilege notice on BJP MPs

శుక్రవారం సభ వాయిదా సభ్యుడి హక్కులను కాలరాయడమేనని చెబుతూ ఆయన రాజ్యసభ చైర్మన్ కురియన్‌కు నోటీసును అందించారు. తన హక్కులకు వారు భంగం కలిగించారన్నారు. కేవీపీ ఈ నోటీసు ఇచ్చి, బీజేపీని చిక్కుల్లో పడేశారని చెప్పవచ్చు.

మధ్యాహ్నం రగడ

రాజ్యసభలో కేవీపీ బిల్లు పైన రగడ కొనసాగుతోంది. మధ్యాహ్నం రాజ్యసభ ప్రారంభమయ్యాక మరోసారి గందరగోళం చెలరేగింది. ఎట్టి పరిస్థితుల్లో బిల్లు పైన చర్చ కావాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. నోటీస్ ఇచ్చాకే చర్చకు అనుమతిస్తామని, ఇప్పుడు చర్చకు తీసుకోమని డిప్యూటీ చైరమన్ కురియన్ చెప్పారు.

బీజేపీ ప్లాన్‌పై జైరాం నిలదీత

జైరాం రమేష్ మాట్లాడుతూ.. హఠాత్తుగా శుక్రవారం సభను వాయిదా వేశారన్నారు. మనీ బిల్లు అంటూ ప్రయివేటు బిల్లు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇది మనీ బిల్లు అని పార్లమెంటు సెంట్రల్ హాలులో ఆర్థిక మంత్రి జైట్లీ తమకు చెప్పారన్నారు.

విజయ సాయి రెడ్డి

విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ.. విభజనకు కాంగ్రెస్ పార్టీదే బా్యత అన్నారు. ఇన్నాళ్లు తాము మాట్లాడేందుకు రాజ్యసభలో ప్రతినిధులు లేరని, కానీ ప్రత్యేక హోదా అంశం ఏపీకి చాలా ముఖ్యమైనదని చెప్పారు. టిడిపి నేతలు కూడా మాట్లాడారు. ఇదే సమయంలో రాజ్యసభలో గందరగోళం కనిపించింది. దీంతో సభను సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేశారు.

వెల్లోకి దూసుకొచ్చిన సభ్యులు

సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి రాజ్యసభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బిల్లు పైన చర్చ, ఓటింగ్ జరపాలని పట్టుబడుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెల్‌లోకి దూసుకు వచ్చారు.

వెల్లోకి దూసుకొచ్చిన సభ్యులు

సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి రాజ్యసభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బిల్లు పైన చర్చ, ఓటింగ్ జరపాలని పట్టుబడుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వెల్‌లోకి దూసుకు వచ్చారు. వెల్లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ సభ్యులు ఓటింగ్ జరపాల్సిందేనని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వీ వాంట్ జస్టిస్ అని నినదించారు.

సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ఓటింగ్ కోసం పట్టుబడుతున్నందున హోదా అంశాన్ని ప్రత్యేక అంశంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ చైర్మన్ కురియన్ ఎంతగా వారించినప్పటికీ వారు వినలేదు. ఇప్పుడు అది చర్చకు తీసుకునేది లేదని చెప్పారు. ఆగస్ట్ 5వ తేదీన ఈ బిల్లును పరిగణలోకి తీసుకుంటామని కురియన్ చెప్పారు.

ఈ శుక్రవారం చేపట్టేలా..

సభ్యులు ఎంతకూ సమ్మతించక పోయేసరికి.. బిల్లు కోసం పట్టుబడుతున్నందున ఈ శుక్రవారమే బిల్లును చేపట్టేలా తాను చైర్మన్‌ను కోరుతానని కురియన్ చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress Party senior leader, Rajya Sabha MP KVP privilege notice on BJP MPs.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి