శృంగారంలో తృప్తి లోపిస్తే ఏమవుతుంది?

శృంగారంలో తృప్తి కలగకపోతే భవిష్యత్తులో మతిమరుపు వచ్చే అవకాశం ఉంది. తాజాగా పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో కూడా ఇదే విషయం వెల్లడైంది. మధ్యవయసులో శృంగారంలో తృప్తి కలగకపోవటానికీ వృద్ధాప్యంలో విషయాన్ని గ్రహించే సామర్థ్యం తగ్గటానికీ సంబంధం ఉన్నట్టు తేలింది. 56-68 సంవత్సరాల మధ్య వయసున్న పురుషులను 12 సంవత్సరాలపాటు పరిశీలించారు. జ్ఞాపకశక్తి, విషయ విశ్లేషణ, సమస్యల పరిష్కార వేగాన్ని క్రమంగా పరీక్షిస్తూ వచ్చారు.

అంగ స్తంభన, శృంగార తృప్తి తగ్గితే భవిష్యత్తులో మతిమరుపు రావటానికీ మధ్య సంబంధం ఉన్నట్లు కనుగొన్నారు. లైంగిక ఆరోగ్యం మీద చేసే పరిశోధనల్లో ఎంత తరుచుగా శృంగారంలో పాల్గొంటున్నారు అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. తాజాగా జరిగిన సర్వేలో మాత్రం శృంగారంపై అభిప్రాయాలను సేకరించారు. శారీరకంగా అందరూ ఒకే సామర్థ్యంతో ఉంటున్నప్పటికీ శృంగారం విషయానికొచ్చేసరికి వారి అనుభవాలు వేర్వేరుగా ఉంటున్నట్లు తేలింది.

 romance

శృంగార తృప్తి, స్తంభన సామర్థ్యం, విషయగ్రహణ మధ్య వయసు నుంచి ప్రారంభమవుతుంది. సర్వే కోసం మధ్య వయసు పురుషులను ఎంచుకున్నారు. సూక్ష్మరక్తనాళాల్లో మార్పులు అంగ స్తంభన లోపానికి దారితీస్తాయని తేలింది. శృంగారంలో తృప్తి భావన తగ్గడానికి మానసిక మార్పులు కారణమవుతాయి. ఈ రెండూ విషయ గ్రహణతో ఎలా ముడిపడివున్నాయో తెలుసుకునే అంశంమీదే పరిశోధకులు దృష్టిసారించారు.

తృప్తి తగ్గినవారిలో విషయాన్ని గ్రహించే తీరులో పనితీరు మందగించినట్లు గుర్తించారు. తక్కువ తృప్తి పొందినవారికి డిమెన్షియా, అల్జీమర్స్, గుండెజబ్బు, ఒత్తిడితో కూడిన ఇతర సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు. శృంగారంలో తృప్తి కలగడానికి మంచి ఆరోగ్యం కూడా ముఖ్యమని తేలుతోంది. మరింత ఎక్కువగా వ్యాయమం చేయడంతోపాటు మంచి ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రక్తనాళాల ఆరోగ్యానికి తోడ్పడటంతోపాటు స్తంభన సామర్థ్యం పెరుగుతుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+