Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జైపాల్ రెడ్డికి లగడపాటి సలహా: పదవికేనని రేవంత్

హైదరాబాద్: దయచేసి విభజనవాదంతో ముందుకు వెళ్లవద్దని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి సలహా ఇచ్చారు. విభజనవాదాన్ని లేవనెత్తింది ముఖ్యమంత్రి పదవి కోసమేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. విభజనను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమర్థంగా ఎదుర్కుంటున్నారని ఆయన అన్నారు.

తాము రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరామని, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులతో పాటు పార్లమెంటు సభ్యులం కలుస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రపతి సిఫార్సుతో మాత్రమే తెలంగాణ బిల్లు ముందుకు వెళ్తుందని, రాష్ట్రపతి సిఫార్సు చేయకపోతే ముందుకు సాగదని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనే నమ్మకంతో తాము చివరి వరకు పోరాడుతామని ఆయన చెప్పారు.

Lagadapati Rajagopal suggests Jaipal Reddy on Telangana

రాష్ట్ర విభజనపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. సరైన సమయంలో మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన చెప్పారు. విభజనను అడ్డుకోవడానికి తాము జాతీయ పార్టీల నాయకులను కూడా కలుస్తామని ఆయన చెప్పారు. కేంద్రం విభజనపై ఏకపక్షంగా, అప్రజాస్వామికంగా ముందుకు సాగుతోందని లగడపాటి విమర్శించారు.

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తే కాంగ్రెసు అద్యక్షురాలు సోనియా గాంధీ తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తుందని జైపాల్ రెడ్డి నమ్ముతున్నారని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజల ముందు సమైక్యవాదం అంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోనియా ముందు విభజనకు తలాడిస్తున్నారని ఆయన అన్నారు. జైపాల్ రెడ్డి సమన్యాయం అంటే తనను ముఖ్యమంత్రిని చేసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమని అనుకుంటున్నట్లున్నారని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రిపై కెటిఆర్ ఫైర్..

రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కేంద్ర మంత్రుల బృందానికి (జివోఎంకు) నివేదిక ఇచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు కెటి రామారావు విరుచుకుపడ్డారు. రాష్ట్రం విడిపోతే నీటి యుద్ధాలు వస్తాయని కిరణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. ఇరు ప్రాంతాల ప్రజలను ముఖ్యమంత్రి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు.

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాలు జరిగిన కూడా ఐదు నదుల జలాలను పంచుకుంటున్నామని ఆయన గుర్తు చేసారు. మరి రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రెండు నదుల జలాలను పంచుకోవడంలో ముఖ్యమంత్రికి భయం ఎందుకని ఆయన ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+