ఎంతదూరమైనా, పాత లక్ష్మిని చూస్తారు: వర్మకు లక్ష్మీపార్వతి వార్నింగ్
హైదరాబాద్: వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై ఇప్పటికే టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీపార్వతి కూడా తీవ్రంగా స్పందించారు. తన పాత్రను తప్పుదోవ పట్టిస్తే మాత్రం సహించేది లేదని వర్మను హెచ్చరించారు.
Recommended Video


ఇప్పటికే వర్మ వర్సెస్ టీడీపీగా..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రాకేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో టీడీపీ మంత్రులు, నేతలు వర్మతోపాటు ఆ పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తమ అధినేతను చెడుగా చూపిస్తే మాత్రం తీవ్ర పరిణామాలుంటాయని వర్మకు హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేయిస్తున్నారని ఆయనపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అందుకే అంగీకరించా..
ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతి కూడా వర్మను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని తీయడంలో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, చరిత్రకు తెలియని విషయాలను చూపిస్తానని చెబుతున్నాడు కాబట్టే తాను ఈ సినిమాకి అంగీకరిస్తున్నానని లక్ష్మీపార్వతి తెలిపారు.

వర్మకు లక్ష్మీపార్వతి వార్నింగ్
అయితే ఈ సినిమా స్టోరీపై ఇంతవరకు తనని వర్మ కలవలేదని, నిజంగా చరిత్రకు తెలియకుండా మరుగునపడిన విషయాలను చూపిస్తే సంతోషిస్తానని లక్ష్మీపార్వతి తెలిపారు. అలా కాకుండా తన ఆత్మగౌరవానికి ఆటంకం కలిగించేలా సినిమా తీస్తే మాత్రం, సినిమాని ఆపేయడానికి ఎంత దూరమైనా వెళతానని తేల్చి చెప్పారు.

పాత లక్ష్మీపార్వతిని చూస్తారు..
అంతేగాక, వర్మ తనలోని పాత లక్ష్మీపార్వతిని చూస్తాడని... ఆమె హెచ్చరికలు జారీ చేశారు. తన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'పై టీడీపీ నేతలు చేసిన అన్ని విమర్శలకు కౌంటర్లు ఇచ్చిన వర్మ.. మరి లక్ష్మీపార్వతి ఇచ్చిన హెచ్చరికకు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications