లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో, ఆఫీసుల్లో ఉండొచ్చా?
జపాన్ కు చెందిన హోతాయ్ బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కఠోర తపస్సు చేయడం ద్వారా అతను జ్ఞానోదయం పొందాడు. జ్ఞానం సంపాదించిన తర్వాత బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టాడు. జీవితంలో ప్రజలను నవ్వించడానికే పని యాలనుకున్నాడు. అనేక దేశాలు పర్యటించిన హోతాయ్ ఎక్కడికి వెళ్లినా ప్రజలను నవ్విస్తూ, వారి జీవితాల్లో ఆనందాన్ని నింపాడు. అలా లాఫింగ్ బుద్ధ అనే పేరు స్థిరపడింది. దీన్ని ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. ఇది ఇంట్లో ఉండటంవల్ల ఆనందం, సంపద వచ్చి చేరుతుంది. అదే సమయంలో ఇంట్లో ఉన్న నెగెటివిటీ కూడా పోతుంది.
లాఫింగ్ బుద్ధ ఎక్కడ పెట్టుకోవాలనే విషయం గురించి వాస్తు చాలా చెప్పింది. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండాలి. తూర్పు వైపున లాఫింగ్ బుద్దుని పెట్టడం ఎంతో శుభప్రదం. పిల్లల స్టడి రూమ్ లో దీన్ని ఉంచితే అది వారి మనసుపై సానుకూల ప్రభావం చూపుతుంది. వారు ఏకాగ్రతతో చదువులో నిమగ్నమవుతారు. కార్యాలయంలో టేబుల్ మీద పెట్టుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది. సహచర ఉద్యోగులతో బంధాలు మెరుగుపడతాయి. వ్యాపార స్థలంలో లాఫింగ్ బుద్ధను ఉంచడంవల్ల వ్యాపారం క్రమక్రమంగా పెరుగుతుంది.

బంగారు నాణేలు మోస్తున్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదని వాస్తు చెబుతోంది. మీ గదిలో లాఫింగ్ బుద్ధ పెట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తులను నిరోధించవచ్చని, బంగారు రంగులో ఉండేది అయితే మరింత మంచిదని వాస్తు పండితులు వెల్లడిస్తున్నారు. ఇది కూడా దేవుడి విగ్రహం లాంటిదే. ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. నేలమీద ఉంచకూడదు. అలాగే చీకటిగా ఉన్న ప్రదేశంలో ఉంచకూడదు. టీవీతోపాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతోపాటు పెట్టకూడదు. అలాగే పూజా స్థానంలో, షూ రాక్ మీద పెట్టొద్దు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంచడం చాలా మంచిది.












Click it and Unblock the Notifications