కలెక్టరేట్‌లో కౌలు రైతు ఆత్మహత్య...సూసైడ్ నోట్ లభ్యం...గుంటూరు జిల్లాలో కలకలం
గుంటూరు: అప్పులపాలైన ఓ కౌలు రైతు దిక్కుతోచని స్థితిలో ఏకంగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అక్కడే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు నగరంలోని కలెక్టరేట్ లో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుని జేబులో ఆత్మహత్యకు గల కారణాలు రాసి ఉన్న ఉత్తరం లభించింది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం...ఫిరంగిపురం మండలం అల్లంవారి పాలెంకు చెందిన కొండవీటి బ్రహ్మయ్య (55) గురువారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలో పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా అక్కడి సిబ్బంది గమనించారు. వెంటనే అతనిని చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతిచెందాడు. కౌలు రైతు బ్రహ్మయ్య కలెక్టరేట్ లో ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింది.

మృతుడు బ్రహ్మయ్య జేబులో తన ఆత్మహత్యకు గల కారణాలు రాసి ఉన్న ఉత్తరం లభించింది. తాను గత ఏడాది పదెకరాల్లో పత్తి, మిరప సాగు చెయ్యగా అందుకోసం రూ. 7 లక్షల వరకు అప్పులయ్యాయని, అవి తీరే మార్గం కనిపించలేదని ఆ లేఖలో పేర్కొన్నాడు. దాని కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు రాశాడు. ఈ ఉత్తరంలో ముఖ్యమంత్రి తనను, కుటుంబాన్నిఆదుకోవాలని రాసి ఉన్నట్టు తెలిసింది. అయితే బ్రహ్మయ్య ఆదుకోవాలని కలెక్టర్ ను కోరదామని ఆయన కార్యాలయం వద్దకు వచ్చినట్లుగా భావిస్తున్నారు. అయితే ఆయన అందుబాటులో లేరని తెలిసి మనోవేదనకు గురై ఈ పని చేసినట్లు తెలుస్తోంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications