ప్రతి 20 రోజులకు ఒక సినిమా విడుదల

సంవత్సరానికి ఒక సినిమా, రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేస్తూ 10 సినిమాలకు సరిపడా పారితోషికం తీసుకునే ఇప్పటి కథానాయకులెవరూ కనీసం సూపర్ స్టార్ కృష్ణతో పోల్చుకోవడానికి కూడా సరితూగరు. పుష్ప2 చిత్రం ఇంతవరకు ప్రారంభమవలేదు.. మహేష్ బాబు-త్రివిక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ చిత్రం.. ఇలా ప్రస్తుతం వీరి చిత్రాలు ప్రణాళికా లోపంతో నిండి ఏడాది నుంచి ఖాళీగా ఉన్నారు. అటువంటి వారు కృష్ణ నుంచి స్ఫూర్తి పొందాలి. మూడు షిఫ్టుల్లో మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ సినిమా ఫెయిలైతే పారితోషకం తీసుకోకుండా తర్వాత సినిమాను ఆ నిర్మాతకు ఉచితంగా చేసేవారు.

చిత్ర పరిశ్రమ కళకళలాడేలా..

చిత్ర పరిశ్రమ కళకళలాడేలా..


ఒక నటుడు ఏడు సంవత్సరాల్లో 115 సినిమాలు చేశారంటే ఎవరైనా నమ్మగలరా? కానీ కృష్ణకు అది అసాధ్యం కాలేదు. సంవత్సరానికి 10 సినిమాలకు తగ్గకుండా నటించేవారు. దీంతో చిత్ర పరిశ్రమతోపాటు నిర్మాతలు, దర్శకులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ సంతోషంగా ఉండేవారు. పరిశ్రమ కళకళకలాడేది. 8 సంవత్సరాల్లో 115 సినిమాల్లో నటించారంటే ఆయన ఎంత కష్టపడేవారో అర్థం చేసుకోవచ్చు.

ప్రతి 20 రోజులకు ఒక సినిమా..

ప్రతి 20 రోజులకు ఒక సినిమా..

ఒకానొక సమయంలో ప్రతి 20 రోజులకు ఆయన నటించిన సినిమా విడుదలయ్యేది. అభిమానులకు అంతకుమించిన పండగ ఏమైనా ఉంటుందా? యువతరం అంతా కృష్ణ సినిమా విడులైనందంటే చాలు ధియేటర్లను హోరెత్తించేవారు. 1968లో 10 సినిమాలు, 1969లో 15 సినిమాలు, 1970లో 16 సినిమాలు, 1971లో 11 సినిమాలు, 1972లో 18 సినిమాలు, 1973లో 15 సినిమాలు, 1974లో 13 సినిమాల్లో నటించారు. ఏడు సంవత్సరాల వ్యవధిలో 98 చిత్రాలు చేసిన సంచలన రికార్డు సృష్టించారు. తొలి సినిమా విడుదలైన మూడు సంవత్సరాలకే అత్యంత భారీ చిత్రాల్లో నటించారు. బాలకృష్ణ మినహా మరే కథానాయకుడికి ఇది సాధ్యం కాలేదని చెప్పవచ్చు.

నిర్మాతల శ్రేయస్సును కోరుకునేవారు

నిర్మాతల శ్రేయస్సును కోరుకునేవారు

నిర్విరామంగా కృష్ణ చేస్తున్న సినిమాలు చూస్తే ఆయన ఎంత కష్టపడుతున్నాడో, నిర్మాత, దర్శకుల కోసం ఎంతగా ఆలోచిస్తున్నారో అర్థమవుతుంది. తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేసేందుకు రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసేవారు. కష్టపడే గుణంతోపాటు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న సూపర్ స్టార్ కృష్ణ లాంటివారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనేకాదుభారతీయ చిత్ర పరిశ్రమలోనే ఎవరూ లేరని చెప్పవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+