టాప్ 10లో ఎన్టీఆర్ లోనే 5, ఏం జరుగుతుందో అని టెన్షన్, దిగులు

ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం విధానం త్వరలోనే అమలులోకి రానుంది. లిక్కర్ షాపుల లైసెన్స్ ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చెయ్యడంతో మద్యం వ్యాపారుల నుంచి తీవ్రస్థాయిలో పోటీ నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ షాపుల లైసెన్స్ లు దక్కించుకోవాలని మద్యం వ్యాపారులు చివరి రోజు వరకు పోటీ పడటంతో 89 వేల 643 దరఖాస్తులు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుమారు రూ1, 890 కోట్ల ఆదాయం వచ్చింది. లిక్కర్ షాప్ ల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి చాలామంది వ్యాపారులు మొదట్లో ఆసక్తి చూపించలేదు. అధికార పార్టీకి చెందిన చాలామంది నాయకులు లిక్కర్ వ్యాపారం చేయడానికి ప్రయత్నిస్తున్న వారిని బెదిరించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే లిక్కర్ షాప్ లైసెన్స్ కోసం చివరి రోజైన శుక్రవారం ఒక్క రోజు మాత్రమే 24 వేలకు పైగా దరఖాస్తులు సమర్పించారు.

Liquor shop licenses are contested by hundreds of people per shop in many districts

ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్, గుంటూరు, తూర్పుగోదావరి, ఏలూరు, విజయనగరం జిల్లాలలో లిక్కర్ షాపుల లైసెన్స్ ల కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలలో అధికార పార్టీ నాయకులతో పాటు వైసీపీకి చెందిన కొందరు నాయకులు లిక్కర్ షాపుల లైసెన్సుల కోసం పోటీ పడుతున్నారని వెలుగు చూసింది. ఇక తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్య సాయి, ప్రకాశం, కాకినాడ జిల్లాలలో లిక్కర్ షాపుల లైసెన్స్ ల కోసం చాలా తక్కువ మంది పోటీపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ షాపుల లైసెన్స్ ల కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో అప్పుడే రాజీలు చేసుకోవడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా దరఖాస్తులు వచ్చిన టాప్ 10 దుకాణాల సంఖ్య తెలుసుకున్న అధికారులు షాక్ అయ్యారు. ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు ఏలూరు జిల్లాలో ఒకే షాపు లైసెన్స్ కోసం వందలాదిమంది దరఖాస్తులు చేసుకున్నారు.

Liquor shop licenses are contested by hundreds of people per shop in many districts

టాప్ 10 దుకాణాలలో ఎన్టీఆర్ జిల్లాలోని ఐదు దుకాణాలు, గుంటూరు జిల్లాలో మూడు దుకాణాలు, కర్నూలు, ఏలూరులో ఒక దుకాణం కోసం ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకున్నారని అధికారులు తెలిపారు. వందల సంఖ్యలో లిక్కర్ షాపుల లైసెన్స్ ల కోసం వ్యాపారాలు పోటీ పడుతున్నారు. కొన్ని షాపుల లైసెన్స్ ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. లిక్కర్ షాపు లైసెన్స్ ఎవరికి వచ్చినా మద్యం వ్యాపారం మాత్రం మేమే చేసుకుంటామని, కావాలంటే మీకు అందులో మీకు కొంచెం వాటా ఇస్తామని కొందరు వ్యాపారులకు చెబుతున్నారని, వాటి కోసం అప్పుడే రాజీలు చేసుకుంటున్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+