మందుబాబులకు లిక్కర్ సేల్ ఆఫర్.. లక్కీ డ్రాలో థాయ్ లాండ్ ట్రిప్

ఇదేందయ్యా ఇది.. నేనెప్పుడూ చూడలే అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. ఇప్పుడు చెప్పబోయే మందు కబురు వింటే.. మందు బాబులు అంతా కూడా యునానిమస్ గా ఇదే మాట చెప్పడం గ్యారంటీ. వ్యాపారాన్ని పెంచుకోవడం కోసం ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అది ఏ సెక్టార్ అయినా కానీ వారి వారి స్టైల్లో ప్రజలని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.

బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి. ఆ పండగ.. ఈ పండుగ అనే తేడా లేకుండా ఫెస్టివల్ సేల్ అని.. సమ్మర్ సేల్, వింటర్ సేల్, అంటూ డిస్కౌంట్లు ఇచ్చేస్తుంటారు. ఇక అప్పుడప్పుడూ లక్కీ డ్రాలు కూడా నిర్వహించడం షరామామూలే. కానీ ఫర్ ది ఫస్ట్ టైమ్.. ఓ మద్యం దుకాణం యజమాని ఇచ్చిన.. ఓ బంపరాఫర్ .. మందుబాబులనే కాదు సామాన్యులను సైతం షాక్ కి గురి చేస్తోంది.

liquor shop owner bumper offer to customers trip to Thailand

కాకినాడ లోని వినాయక వైన్స్ యజమాని.. కస్టమర్లకు కళ్లు చెదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. టికెట్ టు థాయిలాండ్ అంటూ ఆఫర్ ప్రకటించాడు. తన మద్యం దుకాణంలో అన్ని లిక్కర్ బ్రాండ్లు దొరుకుతాయని.. షాపులో మందు కొన్నవారికి టోకెన్లు ఇస్తామని ప్రకటించాడు. ఓ మంచి రోజు చూసి ఆ టోకెన్లను లాటరీ తీస్తామని.. అందులో గెలిచినవారికి ఉచితంగా థాయిలాండ్ వెళ్లే అవకాశం ఇస్తామని అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. ఈ మేరకు తన షాపు ముందు బోర్డులు కూడా ఏర్పాటు చేయించాడు. ఆ బోర్డుల్లో మందు తాగండి.. థాయిలాండ్ వెళ్లండి అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు.

అంతే కాకుండా ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి.. కారు, బైక్, మొబైల్ ఫోన్ వంటి బహుమతులు కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. ఈ మొత్తం గిఫ్ట్ ల విలువ కూడా దాదాపు రూ. 1.5 లక్షల విలువ ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బంపర్ ఆఫర్ విషయం సోషల్ మీడియాలో సైతం పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ ఆఫర్ చూసి మందుబాబులు అంతా వర్త్.. వర్త్ అంటూ షాప్ ముందు క్యూ కడుతున్నారు. మరి లక్కీ డ్రాలో గెలిచి ఉచితంగా థాయిలాండ్ వెళ్లే లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+