ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముహూర్తం, కలిసొచ్చేదెవరికి...!!

ఏపీలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు.. తదనంతర పరిణామాలు ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతున్నాయి. వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ పోరాటాలకు సిద్దం అవుతోంది. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల పైన కీలక సమాచారం అందుతోంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పైన రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. దీంతో, ఎన్నికల పైన దాదాపు ఒక స్పష్టత వచ్చింది.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా పైన కలెక్టర్లకు స్పష్టత ఇచ్చింది. తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దంగా ఉండాలని కేడర్ కు సూచన చేసారు. కాగా, కూటమి పార్టీల్లోని మూడు పార్టీల నేతలు స్థానికంగా ఎన్నికలకు సమాయత్తం అవుతున్నారు. అదే విధంగా స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు మూడు పార్టీల అభ్యర్ధుల నుంచి పోటీ ఎక్కువగా ఉంది. టీడీపీతో పాటుగా బీజేపీ.. జనసేన సైతం స్థానికంగా తమ బలం పెంచుకోవాలని భావిస్తోంది. ఇక... వైసీపీ కడప జిల్లా పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి తరువాత రాష్ట్ర వ్యాప్తం గా జరిగే స్థానిక ఎన్నికల్లో సత్త చాటాలని వేచి చూస్తోంది. దీంతో, ఎన్నికల ముహూర్తం పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.

local-body-elections-to-be-held-in-andhra-pradesh-after-census-completion-as-reports

సెన్సెస్ పూర్తయిన తరువాతనే

అయితే, ఇదే సమయంలో కీలక అప్డేట్ అందుతోంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించటం లేదు. దేశ వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ తరువాత జన గణన ప్రారంభం కానుంది. ఇందు కోసం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించారు. దీంతో.. 20వ తేదీ లోగా స్థానిక ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంది. దీనికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. నామినేషన్ల ఘట్టం పూర్తి చేసింది. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ఇక.. సెన్సెస్ పూర్తి చేసి లెక్కలు వెల్లడించిన తరువాతనే ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సెన్సెస్ పూర్తి కావటానికి దాదాపు ఏడాదిన్నార కాలం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ లెక్కన 2027 ద్వితీయార్ధంలో లేదా 2028 ప్రారంభంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. అప్పటి వరకు ఏపీలో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ లేదని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+