Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఓటేయడానికి వెళ్తున్నారా? స్లిప్ ఉన్నప్పటికీ.. ప్రత్యామ్నాయ గుర్తింపుకార్డులు దగ్గరుంచుకోండి?

Recommended Video

    AP Assembly Elections 2019 : ఓటరు స్లిప్ ఉన్నప్పటికీ.... మరొక గుర్తింపుకార్డు దగ్గరుంచుకోండి..?

    హైదరాబాద్/అమరావతి: మరి కొన్ని గంటలు! రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఆరంభం కానుంది. గురువారం ఉదయం 7 గంటలకు ఆరంభమయ్యే పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్ కోసం రెండు రాష్ట్రాల్లో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి ముందు ఓటర్లు.. కొన్ని గుర్తింపు కార్డులను తమ వెంట తీసుకెళ్లాలని కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. స్లిప్ తో పాటు ఓటరు గుర్తింపు కార్డును కూడా పోలింగ్ కేంద్రంలో అక్కడి సిబ్బంది, ఏజెంట్లకు చూపించాల్సి ఉంటుంది.

    ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు, తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్ జరుగనుంది. ఓటరు గుర్తింపు కార్డు వెంట తీసుకెళ్లినప్పటికీ.. ఏదైనా మరొక కార్డు ఉండటం మంచిది. పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, సర్వీస్ ఐడీ కార్డు, ఫొటోతో కూడిన బ్యాంక్ పాస్ బుక్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వ/ప్రభుత్వేతర/ప్రైవేటు విద్యాసంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డులు, మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం జారీ చేసిన జాబ్ కార్డు, కార్మిక శాఖ మంజూరు చేసిన ఆరోగ్య బీమా కార్డు, ఫొటో ఉన్న పింఛన్ కార్డు, కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/ప్రభుత్వరంగ సంస్థలు/పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు తమ ఉద్యోగుల కోసం జారీ చేసిన ఫొటో ఉన్న గుర్తింపు కార్డులను ప్రత్యామ్నాయంగా చూపించవచ్చు.

    Lok Sabha elections 2019: Know what are the poll timings

    ఓటర్లు తమ వెంట ఎవరూ సెల్ ఫోన్లను తీసుకెళ్ల కూడదు. అవి వెంట ఉంటే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడానికి పోలీసులు అనుమతి ఇవ్వరు. మద్యం సేవించి ఓటు వేయడానికి వెళ్లకూడదు. పోలీసులు సూచించిన నిబంధనల ప్రకారం.. పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరం వరకు ఎలాంటి మారణాయుధాలు తీసుకెళ్లరాదు. అలాగే- వాటర్ బాటిల్స్ గానీ ఇంకు బాటిల్స్ కానీ తీసుకెళ్ల కూడదు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన స్టిక్కర్లు ,టోపీలు, కండువాలు, జెండాలతో పోలింగ్ కేంద్రాల సమీపంలో తిరుగాడకూడదు. వారిని అరెస్టు చేసే అధికారం పోలీసులకు ఉంది.

    పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు దూరంలో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఉండవచ్చు. ఇద్దరికి మాత్రమే ఆ అవకాశం ఉంది. ఎక్కువ మందితో గుమికూడి ఉండటానికి పోలీసులు అనుమతి ఇవ్వరు. పార్టీ జెండాలు కానీ గుర్తులు కానీ బ్యానర్లు గాని ప్రదర్శించరాదు. ఓటర్ స్లిప్పులు ఇచ్చేవారు ఎటువంటి పార్టీ గుర్తు రంగులు అభ్యర్థి పేర్లు మొదలగునవి కలిగిన వాటిపైన ఇవ్వరాదు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+