చంద్రబాబు సీరియస్, కేసు ఎక్కడ వరకు వచ్చింది, పెద్దిరెడ్డి శిష్యుడు ఎక్కడ ?

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి నిప్పంటించిన కేసులో నిందితుల కోసం ప్రత్యేక టీమ్ పోలీసులు నాలుగు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రికార్డులకు కావాలనే నిందితులు నిప్పంటించారని కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారులు నిర్దారించారు. ఇప్పటికే కేసులో కొందరు నిందితుల పేర్లను అధికారులు గుర్తించారు.

మదనపల్లె ఆర్డీఓగా హరిప్రసాద్ పని చేస్తున్న సమయంలోనే సబ్ కలెక్టర్ ఆఫీసులో మంటలు వ్యాపించాయి.. ఈ దెబ్బతో ఆర్డీఓ హరిప్రసాద్ ను సస్పెండ్ చేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంటలు వ్యాపించిన విషయాన్ని ఆర్డీఓ హరిప్రసాద్ కలెక్టర్ కు కాని, ఉన్నతాధికారులకు కాని, పోలీసు అధికారులకు కాని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నిర్లక్షం చేశారని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి.

Madapanapalle sub collector office fire case is investigated from several angles

గతంలో మదనపల్లెలో ఆర్డీఓగా పని చేసి తరువాత తిరుమతి కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్న మురళి మీద సస్పెన్షన్ వేటు వేశారు. ఎందుకంటే మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గతంలో పని చేసిన ఆర్డీఓ మురళి అనేక అవకతవకలకు పాల్పడ్డాడని, అతను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డితో పాటు వైసీపీ నాయకులకు పూర్తిగా సహకరించి అనేక భూముల రికార్డులు తారుమారు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇక మంటలు వ్యాపించడానికి గంట ముందు వరకు సబ్ కలెక్టర్ ఆఫీసులో ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఆర్డీఓలు హరిప్రసాద్, మురళిని కూడా పోలీసు అధికారులు విచారిస్తున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు హరిప్రసాద్, మురళి, గౌతమ్ తేజ్ పోలీసులకు చిక్కిన తరువాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రధాన అనుచరుడు, వైసీపీ సీనియర్ నాయకుడు మాధవ రెడ్డి మాయం అయ్యాడు. వైసీపీ నాయకుడు మాధవ రెడ్డిని పట్టుకోవడానికి ప్రత్యేక టీమ్ పోలీసులు గాలిస్తున్నారు.

Madapanapalle sub collector office fire case is investigated from several angles

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మాధవ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు అయినా మాధవ రెడ్డి ఆచూకి ఏమాత్రం చిక్కకపోవడంతో పోలీసులు అయోమయంలో పడ్డారని తెలిసింది. మాధవ రెడ్డి కుటుంబ సభ్యులకు కూడా ఆయన అందుబాటులో లేరని ఓ పోలీసు అధికారి అంటున్నారు. అయితే మాధవ రెడ్డి చిక్కితేనే ఈ కేసు ముందుకు వెళ్లే అవాకవం ఉంటుందని, ఇప్పటికే కేసు విచారణ ఓ కొలిక్కి తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నామని విజయవాడలోని ఓ పోలీసు అధికారి అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+