దోశలు వేసి, టీ విక్రయించిన టీడీపీ ఎంపీ మాగంటి!

Subscribe to Oneindia Telugu

భద్రాద్రి: ఏలూరు ఎంపీ మాగంటి బాబు అశ్వారావుపేటలో పర్యటన చేసి సరదాగా గడిపారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు నుంచి సాయంత్రం 5గంటలకు అశ్వారావుపేటకు వచ్చిన ఆయన పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న ఓ హోటల్‌కు వెళ్లారు.

 maganti babu make Dosa and sell tea

అక్కడ కొద్దిసేపు దోశలు వేశారు. అనంతరం ఇడ్లీ, దోశలు విక్రయించారు. ఆ పక్కనే ఉన్న టీ దుకాణం వద్దకు వెళ్లి టీ విక్రయించారు. సమాచారం తెలుసుకున్న పట్టణ ప్రజలు ఆయనను చూసేందుకు వచ్చారు.

ఈ సందర్భంగా తరచూ ఇటు వైపు వస్తూ ఉంటానని ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ, పార్టీ ఉపాధ్యక్షుడు ఎం. రాజమోహన్‌రెడ్డి పలువురు నేతలు ఉన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam MP Maganti Babu on Tuesday made a Dosa and sell tea in Aswaraopeta in Badradri district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి