ఫ్లాప్ అవుతాయని తెలిసీ మహేష్ బాబు చేసిన సినిమాలు?
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరంలేదు. ప్రిన్స్ గా అభిమానుల గుండెల్లో, మన్మథుడిగా అమ్మాయిల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు. తనతో సినిమా తీస్తే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకాన్ని నిర్మాతల్లో కల్పించగలిగాడు. అంత జాగ్రత్తగా, సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. అయినప్పటికీ మధ్యలో ఒకటీ అరా సినిమాలు ప్లాప్ అవుతూనే ఉన్నాయి.
సినిమాలో నటించేటప్పుడు నటీనటులందరికీ ఆ సినిమాపై ఒక అవగాహన వస్తుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత బ్లాక్ బస్టర్ అవుతుందా? లేదంటే సూపర్ హిట్ అవుతుందా? యావరేజ్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అనే అంచనాలుంటాయి. అలాంటి అంచనాలే మహేష్ బాబుకు కూడా ఉంటాయి. బాక్సాఫీస్ రికార్డులను ఎన్నిసార్లు బద్దలు కొట్టినప్పటికీ, కొత్త రికార్డులు సృష్టించినప్పటికీ కొన్ని సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. మహేష్ బాబుకు పెద్ద షాక్ ను ఇచ్చాయి.

తన కెరీర్ లో సినిమాలు చేసేటప్పుడే అవి ఫ్లాప్ అవుతాయని ముందే తెలుసంట. కానీ సినిమా ఒప్పుకున్నాం కాబట్టి పూర్తిచేయక తప్పదని ఆ సినిమాల్లో నటించాడు. ఆ సినిమాలు ఏంటో తెలుసుకుందాం. తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్లో వచ్చిన స్పైడర్ సినిమా ఒకటి. భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ సినిమా చేసే సమయంలోనే తేడా కొడుతోంది.. ఫ్లాప్ అవుతుందని హేష్ బాబుకి తెలిసిందంట. కానీ ఒప్పుకున్నాం కాబట్టి ఈ సినిమాలో నటించారట.
శ్రీకాంత్ అడ్డాల - మహేష్ బాబు కాంబినేషన్లో వ బ్రహ్మోత్సవం డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలోనటించే సమయంలో మహేష్ బాబుకు మధ్యలోనే ఊహించని షాక్ తగిలింది. స్క్రిప్ట్ మొత్తం పూర్తి కాలేదని తెలిసింది. స్క్రిప్ట్ పూర్తయిన తర్వాతే కదా సినిమాను ప్రారంభించాలి అని డైరెక్టర్ కు వార్నింగ్ ఇచ్చాడు. ఇది కూడా పోతుందని, హిట్ అవదని అనుకున్నాడంట. అనుకున్నట్లుగానే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా తన్నేసింది.












Click it and Unblock the Notifications